మహేశ్ బాబు, నరేశ్ పై కృష్ణ అభిమానుల ఫైర్

0
1399

సూపర్ స్టార్ కృష్ణ చనినపోయిన రెండు నెలలు కూడా కాలేదు. కృష్ణ చనినపోయిన సమయంలో ఆయన కుమారుడు మహేశ్ బాబు, విజయ నిర్మల కొడుకు సీనియర్ నరేశ్ చేసిన ఒక పనికి సూపర్ స్టార్ ఫ్యాన్స్ బాగా ఆగ్రహంగా ఉన్నారట. నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి తన మామ కృష్ణ మరణం తాలూకు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోతో ఒక షాకింగ్ విషయం జయటపడింది. దీనిపై ఇప్పుడు నెట్టింట్లో కామెంట్లు వినిపిస్తున్నాయి. రమ్య సోషల్ మీడియాలో పెట్టిన వీడియోపై సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ మా అభిమాన హీరోను ఇంత చులకనగా చూస్తారా అంటూ మండిపడుతున్నారు. ఆదేంటో ఇక్కడ చూద్దాం.

కృష్ణ పార్థివదేహం వద్ద కనిపించని కొడుకులు

సూపర్ స్టార్ కృష్ణ మరణం సీనియర్ నరేశ్ ఇంట్లో జరిగింది. అప్పటికి ఆయన అక్కడే ఉన్నారు. అప్పుడు నరేశ్ భార్య రమ్యా రఘుపతి ఆయనకు సేవలు చేసేది. అయితే కృష్ణ తీవ్ర అనారోగ్యం పాలవడంతో వైద్యం కోసం హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూనే ఆయన తుదిశ్వాస విడిచారు. తర్వాత సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహాన్ని నరేశ్ ఇంటికి తీసుకువచ్చారు. అయితే పార్థిక దేహం వద్ద ఎవరూ లేకపోవడం విడ్డూరంగా ఉంది.

మహేశ్ బాబు ఫ్యామిలీ ఉదయం అంత్యక్రియలకు రావాలి కాబట్టి రాత్రే ఇంటికి వెళ్లిపోయారు. నరేశ్ ఇంట్లోనే పార్థివ దేహం ఉన్నప్పటికీ పక్కన లేరు. ఈ వీడియో చూసిన చాలా మంది కృష్ణ అభిమానులు కన్నీరు కార్చారట. మమ్మల్ని చూసుకోమన్నా కంటికి రెప్పలా చూసేకునే వాళ్లమంటూ కామెంట్లు పెడుతున్నారు. తన సొంత కొడుకు కాకున్నా నరేశ్ ను చాలా ప్రేమగా పెంచారు కృష్ణ.

నరేశ్ ను బాగా అభిమానించే వారు కృష్ణ

నరేశ్ వ్యక్తిగత జీవితంపై అప్పుడప్పుడు కలవర పడుతుండేవారు కృష్ణ. సూపర్ స్టార్ చనిపోయిన సమయం వరకు ఆయన పవిత్రీ లోకేశ్ తో రిలేషన్ లో ఉన్నానని ప్రకటించాడు. కృష్ణ పార్థివ దేహాన్ని దర్శించుకునేందుకు కూడా పవిత్రతోని వచ్చారు నరేశ్. ఇక ఆయన పోయి రెండు నెలలు కూడా గడువకముందే పవిత్రతో లిప్ లాక్ సీన్లు, పెళ్లి చేసుకుంటామని ప్రకటించడం ఇలాంటివి చూస్తున్న కృష్ణ అభిమానులు మండిపడుతున్నారు. అందరికీ షేర్ చేస్తూ నరేశ్ తో పాటు మహేశ్ బాబుపై కూడా గుర్రుగా ఉన్నారట.

వెకేషన్ల పేరుతో మహేశ్ బాబు టూర్లు

ఈ విషయంలో మహేశ్ బాబు కూడా ఏం తక్కువ తినలేదంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తండ్రి మరణించి రెండు నెలలు కూడా గడవక ముందే వెకేషన్లకు వెళ్తూ.. ఆ ఫొటోలను కూడా షేర్ చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం మహేశ్ బాబు సినిమాలపై కూడా పడుతుందని మరి కొందరు అనుకుంటున్నారు. ‘మీ తండ్రి అభిమానుల సపోర్ట్ లేకుండా ఏ పనీ చేయలేవని ఫైర్ అవుతున్నారట. ఏది ఏమైనా అంతటి గొప్ప నటుడికి మీరు ఇంతలా అగౌరవపరచడం బాగాలేదని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.