న్యూస్ ఛానళ్లలో ఆ సన్నివేశాలకు ప్రభుత్వం చెక్

0
722

కేంద్ర సమాచార-ప్రసారాల మంత్రిత్వ శాఖ టీవీ న్యూస్ ఛానళ్లకు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ గైడ్ లైన్స్ పరిధిలోనే పని చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. క్రైమ్ న్యూస్ ప్రసారం విషయంలో నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని చెప్పింది. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని తేల్చి చెప్పింది. క్రైమ్ న్యూస్ ప్రసారంలో ప్రసార మాధ్యమాల దూకుడుకు చెక్ పెట్టింది. నేరానికి సంబంధించి వార్తలను ప్రసారం చేసేప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి సూచించింది. సంచలనాల పేరుతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే చర్యలు తప్పవని చెప్పింది.

వార్తలను కవర్ చేసే సమయంలో

దీనికి సంబంధించి జనవరి 9న కేంద్ర సమాచార-ప్రసారాల మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలు, నిబంధనలను విడుదల చేసింది. దీనికి కారణాలను కూడా స్పష్టంగా చూపించింది. మహిళలు, చిన్నారులు, వృద్ధులపై హింసాత్మక కథనాలను ప్రసారం చేయవద్దని తెలిపింది. యాక్సిడెంట్లు, హత్యలు, తదితర నేర వార్తలను కవర్ చేసే సమయంలో నైతిక విలువలను గుర్తుంచుకోవాలని సూచించింది. ఈ వార్తలపై సానుకూలంగా వ్యవహరించాలని చెప్పింది. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని వివరించింది శాఖ.

కట్టుబడి పని చేయాలని ఆదేశం

ప్రమాదాలు, నేరాలకు సంబంధించిన ఘటనల్లో టీవీ ఛానళ్లు భయానక వాతావరణాన్ని ప్రసారం చేస్తున్నాయని మండిపడింది. ఇవి చిన్నారులపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని పేర్కొంది. కేబుల్ టెవిజన్ నెట్ వర్క్ (రెగ్యులేషన్) యాక్ట్-1995 కు కట్టుబడి పని చేయాలని ఆదేశించింది. కొన్ని క్రైమ్ వార్తల్లో టీవీ ఛానళ్లు డెడ్ బాడీ ఫొటోలు, రక్తం ఫొటోలను స్పష్టంగా చూపడాన్ని ఆక్షేపించింది. చాలా వరకూ సోషల్ మీడియా నుంచి తీసుకున్న వీడియోలు, ఫొటోలను యథావిధిగా ప్రసారం చేస్తుండడంతో వీక్షకులు కలవరపాటుకు గురవుతున్నారని శాఖ పేర్కొంది.

వీడియోలు, ఫొటోలు పెట్టవద్దని సూచన

క్రైమ్ వీడియోలైనా, పొటోలనైనా తప్పకుండా బ్లర్ చేయాలని చెప్పింది. లేదంటే లాగ్ షాట్ లో నైనా చూపెట్టాలని కానీ క్లోజప్, క్లారిటీ ఇమేజ్ లను చూపితే అసహ్య కరంగా, బాధ కలిగించేదిగా ఉంటుదని చెప్పింది. సెన్సేషన్ పేరుతో అవమానకరమైన వీడియోలు, ఫొటోలు పెట్టవద్దని చెప్పింది. టెలివిజన్ లో వచ్చే వార్తలను సాధారణంగా ఇంటిల్లి పాది చూస్తారు. ఈ విషయాన్ని టీవీ ఛానళ్ల వాళ్లు దృష్టిలో పెట్టుకోవాలని తెలిపింది. బాధ్యతాయుత కంటెంట్ ఇవ్వాలని సూచనలు చేసింది. రిషబ్ పంత్ కారు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో ఆయన కాలిన గాయాలతో ఉన్న వీడియోలతో పాటు ఫొటోలను ప్రసార మాధ్యమాలు ప్రచురించాయి.

చర్యలు తప్పవా

ఇకపై అలాంటి వార్తలు ప్రసారం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు జరీ చేసింది. లేని పక్షంలో చట్ట రీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పనట్లు తెలుస్తుంది. ఇవి దేశంలోని అన్ని న్యూస్ ఛానల్ లకి వర్తిస్తాయని తెలుస్తుంది. రిషబ్ కారు అగ్ని ప్రమాదానికి గురైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సంచలనాలు పేరుతో ఇలాటివి చేయవద్దని సూచింది. బాధ్యతాయుతగా వార్తలు ప్రసారం చేయాలనీ చెప్పింది. టీవీ ఛానళ్ల వాళ్లు ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పింది.