కేజీఎఫ్ 3 గురించి బిగ్ అప్ డేట్స్.. అప్పుడే

0
578

పాన్ ఇండియా లెవల్లో సంచలనాలను నమోదు చేసుకున్న కేజీఎఫ్ గురించి పరిచయం అవసరం లేదు. మొదట ప్రాంతీయ భాషలోనే తీద్దాం అనుకున్న సినిమాను తర్వాత అన్ని భాషలలో పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేసింది ‘హోంబలే ఫిలిమ్స్.’ ఆ తర్వాత వసూళ్లలో ఇప్పుడు ఇది మొదటి వరుసలో ఉంది. బాహుబలి లాంటి సినిమాను కూడా వెనక్కు నెట్టి వసూళ్లను రాబట్టడంలో కేజీఎఫ్ విజయం సాధించిందనే చెప్పాలి. ఇందులో యష్ నటన మరింత విజయానికి తోడైంది. చాప్టర్ 1 నుంచి చాప్టర్ 2 వరకూ యష్ యాక్టింగ్ ఆయన పాత్ర కొత్త అందాన్ని ఇచ్చింది.

కేజీఎఫ్ 3పై ప్రొడ్యూసర్

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండో చాప్టర్ ఎండింగ్ లో చాప్టర్ 3 కూడా ఉండబోతోందని డైరెక్టర్ హింట్ ఇచ్చాడు. అది ఎప్పుడు అనే దానిపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెప్తున్నారు. అయితే ఈ మధ్య ఈ చిత్ర యూనిట్ లోని ఒక్కొక్కరూ వేర్వేరు ఇంటర్వ్యూలలో కొన్ని విషయాలను వెల్లడించారు. చాప్టర్ 3పై కొన్ని విశేషాలు చెప్తూ వస్తున్నారు. కేజీఎఫ్ హోంబలే ఫిలిం బ్యానర్ పై వచ్చింది. ఈ బ్యానర్ ఓనర్ విజయ్ కిర్గందూర్ తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఈ చిత్రం గురించి కొన్ని విషయాలను వివరించారు. అవేంటో చూద్దాం.

చాప్టర్ 3లో కొత్త హీరో

‘రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ తర్వాత చాలా బిజీగా మారాడు. ప్రస్తుతం ఆయన ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నాడు. అది కూడా అంతే అంకిత భావంతో చేస్తారు ఆయన. ఈ నేపథ్యంలో చాప్టర్ 3లో మరో హీరోను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. జేమ్స్ బాండ్ సిరీస్ లో లాగా కేజీఎఫ్ ను తీయాలని అనుకుంటున్నాం. కేజీఎఫ్ కూడా 5 చాప్లర్లుగా వస్తుంది. చాప్టర్ 3 నుంచి హీరోను కూడా మార్చాలని చూస్తున్నాం. కొత్త హీరోనా లేక.. ఇప్పటికే భారీ హిట్లు సంపాదించుకున్న యంగ్ హీరోనా అని అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది. దాని గురించి తర్వాత చెప్తా.

రెండు ప్రాజెక్టుల తర్వాత కేజీఎఫ్ కు ప్రశాంత్ నీల్

ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ తీయడంలో బిజీగా ఉన్నాడు. వరుసగా రెండు మెగా ప్రాజెక్టులు తీసిన ఆయన కూడా ఇండస్ట్రీలో బిజీగా మారాడు. యంగ్ స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ సినిమా పూర్తవగానే జూనియర్ ఎన్టీఆర్ తో మరో ప్రాజెక్టులో పని చేయనున్నారు ప్రశాంత్ నీల్. ఈ రెండు ప్రాజెక్టులు ముగిసిన తర్వాత కేజీఎఫ్ 3కి పని చేయనున్నారు. అయితే కేజీఎఫ్ చాప్టర్ 3 2025 ప్రథమార్ధంలో సెట్స్ పైకి వెళ్లనుంది. చిత్రాన్ని మాత్రం 2026లో రిలీజ్ చేసేందుకు ఒక ప్రణాళిక పెట్టకున్నాం. ప్రశాంత్ నీల్ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే కేజీఎఫ్ లోకి వస్తారు. అంత వరకూ వేచి చూడాలి’ అని విజయ్ చెప్పాడు.

అభిమానులు అంచనాలు

ఇప్పటికే రెండు కేజీఎఫ్ లు పాన్ ఇండియా వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజగా ఛాపర్ 3 కూడా సంచలనం రేపుతోందని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. అంచనాలు అందుకునే విధంగా సినిమాని నిర్మిస్తామని నిర్మాతలు చెబుతున్నారు.