పవన్‌ అభిమానులకు మంట పుట్టించిన రాజమౌళి

0
920

నోరు మంచిదైతే.. ఊరు మంచిదౌతుంది అంటారు. పైగా ఆ వ్యక్తితో మనకు అవసరం ఉన్నప్పుడు మాట అదుపులో ఉండాలి. కానీ ఏ వ్యక్తికైతే కృతజ్ఞత చెప్పాలని ప్రెస్‌మీట్‌ పెట్టామో, అదే ప్రెస్‌మీట్‌లో అదే వ్యక్తిని పరోక్షంగా అవమానించేలా మాట్లాడితే ఎంత తప్పు. అందులోనూ భారీ ఫాలోయింగ్‌ ఉన్న ఓ స్టార్‌ హీరోను అయితే మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బంది ఇప్పుడు దిల్‌రాజుకు ఎదురౌతోంది. కోవిడ్‌ కారణంగా పలు భారీ చిత్రాలు షెడ్యూల్స్‌ ముందుకు, వెనక్కు జరిగి చివరికి సంక్రాంతి మీదకు వచ్చి పడ్డాయి. దీంతో పెద్ద చిత్రాల నిర్మాతలు అందరూ తలలు పట్టుకున్నారు.

భీమ్లానాయక్‌ విడుదలను చాలాకాలం క్రితమే

ఇలా అయితే అందరికీ ఇబ్బంది అని నిర్మాతల మండలి భావించింది. వెంటనే అందరూ సమావేశం అయి భారీ చిత్రాలు అయిన ఆర్‌.ఆర్‌.ఆర్‌. రాధేశ్యామ్‌, సర్కారువారిపాట, భీమ్లానాయక్‌, ఆచార్య వంటి భారీ చిత్రాల విడుదల షెడ్యూల్స్‌ను ఖరారు చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం పవన్‌ కల్యాణ్‌ భీమ్లానాయక్‌ సంక్రాంతికి విడుదల కావాలి. ఈ విడుదలను నిర్మాత చాలాకాలం క్రితమే ప్రకటించారు.

ఒక్కసారిగా ఎందుకిలా?

అయితే సంవత్సరాల తరబడి షూటింగ్‌ జరుపుకుంటూ వచ్చిన ఆర్‌.ఆర్‌.ఆర్‌., రాధేశ్యామ్‌లు సంక్రాంతి టార్గెట్‌గా బరిలోకి రావడంతో పవన్‌ పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తన సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేయటానికి అంగీకరించారు. సినిమా విడుదల అనేది నిర్మాతల చేతుల్లో ఉండే అంశం అయినప్పటికీ, ఓ స్టార్‌ హీరో సినిమా విడుదల విషయంలో అతనిని ఒప్పించకుండా నిర్మాత ముందుకు వెళ్లలేరు అనేది వాస్తవం.

రాజుగారి రెండో భార్య మంచిది అంటే

ఇలా సహకరించిన పవన్‌ను కృతజ్ఞత చెప్పటానికి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో దిల్‌ రాజు ‘‘అసలు సంక్రాంతికి పర్‌ఫెక్ట్‌ సినిమా మహేష్‌ ‘సర్కారు వారి పాట’’ అన్నారు. ఇప్పుడు పవన్‌ అభిమానులకు ఇదే మంట పుట్టిస్తోంది. పరిశ్రమ మంచి కోసం మా హీరో సహకరిస్తే.. దిల్‌రాజు ఇలా తమ సినిమా సంక్రాంతికి అర్హత లేనిది అన్నట్లుగా మాట్లాడటం మంచిది కాదని వారు మండి పడుతున్నారు. మొత్తానికి రాజుగారి రెండో భార్య మంచిది అంటే.. మొదటి భార్య ఏమని అర్ధమో దిల్‌రాజుకు తెలియంది కాదు. కానీ ఫ్లోలో ఏదో అనేసి ఇలా పవన్‌ అభిమానులకు టార్గెట్‌గా మారారు.