‘బిగ్ బాస్ 7’ నుంచి నాగార్జున అవుట్.. ఆ ఇద్దరు హీరోలకే ఛాన్స్

0
351

బిగ్ బాస్ కు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. 2017 నుంచి బిగ్ బాస్ షో తెలుగులో కొనసాగుతోంది. విదేశాలలో ‘బిగ్ బ్రదర్’ పేరుతో కొనసాగిన షో మొదట బాలీవుడ్ ను పలకరించింది. తర్వాత తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది. మొదటి సీజన్ నుంచి బిగ్ బాస్ కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఏర్పడ్డారంటే ఈ షో తెచ్చే హైప్ అంతా ఇంతా కాదు.

నాలుగు సీజన్లలో కొనసాగిన నాగార్జున

దాదాపు 5 సంవత్సరాల నుంచి బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. షో ప్రారంభ సీజన్ కు హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరించారు. తర్వాతి సీజన్ కు వచ్చే సరికి న్యాచురల్ స్టార్ నాని ఎంటర్ అయ్యిడు. ఆ తర్వాత నాగార్జున చేతిలోకి వెళ్లింది షో. అయితే మొదటి రెండు సీజన్లు వారు నిర్వహించగా, మూడో సీజన్ నుంచి ఆరో సీజన్ వరకూ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు.

అయితే ఇటీవల ఆయన సీజన్ 7కు హోస్టింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బిగ్ బాస్ షోకు మరో హోస్ట్ వస్తున్నారన్న వార్తలపై ఇంత వరకూ ఎలాంటి క్లారిటీ రాకపోయినా కొన్ని పోస్టులు మాత్రం నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ ఎవరు..?

వరుసగా నాలుగు సీజన్లు కంటిన్యూ చేసిన నాగార్జున బిగ్ బాస్ షో నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారని, ఆయన స్థానంలో మరో స్టార్ హీరో వస్తున్నారట. అయితే ఆ పేరును కూడా ఇప్పటికే నాగార్జున సూచించారట. బిగ్ బాస్ సీజన్ 7కు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వస్తున్నట్లు మొదట వార్తలు వినిపించాయి. సీనియర్ హీరో, ప్రస్తుతం విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య బాబు హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 7 నిర్వహిస్తే దబ్బిడి.. దిబ్బిడే మరి.

నందమూరి లేనట్టే..!?

నందమూరి బాలకృష్ణ ఆహాలో చేస్తున్న ‘అన్ స్టాపబుల్ ఎన్‌బీకే 2’ భారీ వ్యూవర్ షిప్ తో దూసుకెళ్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ తో నందమూరి హోస్ట్ గా చేస్తున్న ఈ షో ‘ఆహా’కే కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఈ ఎపీసోడ్స్ కోసమే ఎంతో మంది ఆహా ప్లాట్ ఫారంలో చేరారట. వరుస పెట్టి చేస్తు్న్న ఈ ఎపీసోడ్ లతో ఆహా రేటింగ్ కూడా అమాంతం పెరిగిందట.

అయితే ఆయనను బిగ్ బాస్ సీజన్ 7 నుంచి హోస్ట్ గా తేవాలని అనుకుంటున్నట్లు వార్తలు కూడా వ్యాపిస్తున్నాయి. అయితే ఇవన్నీ నిజం కాదని తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు ‘బిగ్ బాస్ 7’కు హోస్ట్ గా రాణా దగ్గుబాటిని నాగార్జున సూచించినట్లు తెలస్తోంది.

రాణా రానున్నాడా..?

రాణా బాహుబలి లాంటి మంచి చిత్రాలలో నటించి మెప్పించారు. దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన రాణా గతంలో ఆహాలో ఒకటి, రెండు షోలను హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలసిందే. ఆయన హోస్ట్ గా బాగా రాణించారు. సినిమాల్లో వరుస హిట్లతో రాణిస్తున్నాడు రాణా. కొంత కాలం నుంచి ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇందుకు ఆయన ఆరోగ్యం కూడా సహకరించడం లేదని తెలుస్తోంది.

బిగ్ బాస్ షో ఆయనకు మేలు

రాణా ఫైట్స్, యాక్షన్, డ్యాన్స్ సన్నివేశాలకు మరికొన్ని రోజులు దూరంగా ఉండాలని ఆయన డాక్టర్లు సూచించారు. ఇలాంటి సీన్లు లేకుండా సినిమాలు ఉండవు కాబట్టి మరికొంత కాలం దూరంగా ఉండాలని చూస్తున్నారు రాణా. అయితే పూర్తిగా దూరంగా కాకుండా కొంత మేరకైనా నటనకు కనెక్షన్ ఉన్న బిగ్ బాస్ షో ఆయనకు మేలు చేస్తుందటని నాగార్జున రాణా పేరును సూచించారట. ఇప్పటి వరకూ దీనిపై క్లారిటీ మాత్రం రాలేదు.

బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ వచ్చే ఏడాది మొదటి లేదా రెండో నెలతో పూర్తి కాబోతుంది. బాలకృష్ణ బిగ్ బాస్ కు వస్తారా.. లేక నాగార్జునసూచనల మేరకు రాణా వస్తాడా.. లేక ఈ మధ్య బాగా వైరల్ అయిన మెగా వారసుడు రామ్ చరణ్ వస్తారా.. ఈ వార్తల నేపథ్యంలో బిగ్ బాస్ ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.