బాలయ్య పవన్ కళ్యాణ్ ను అడగబోయే ప్రశ్నలు ఇవే..?

0
307

అన్ స్టాపబుల్ సీజన్ 2తో నందమూరి బాలకృష్ణ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారనే చెప్పాలి. డిఫరెంట్ పర్సనాలిటీస్ ను షోకు తీసుకస్తూ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నారు. ఈ సీజన్ లో పొలిటీషియన్స్, స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఇలా ప్రతి ఒక్కరితో సందడి చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు బాలయ్య బాబు. ఇటీవల బాహుబలిని షోకు తీసుకువచ్చిన బాలకృష్ణ ఆయన పెళ్లిపై మాట్లాడి ఒక క్లారిటీ తీసుకచ్చే ప్రయత్నం చేశారు.

ఇక తర్వాత ఎపీసోడ్ కు పవన్ కళ్యాణ్ ను తీసుకచ్చేందుకు భారీగా ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఎపీసోడ్ తర్వత అన్ స్టాపబుల్ సీజన్ 2 ముగుస్తుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

అన్ స్టాపబుల్ లో బాలయ్య సందడి

ఎప్పుడూ కెమెరా ముందు కనిపించని వారు కూడా ‘అన్ స్టాపబుల్’లో బాలయ్యతో కలిసి సందడి చేస్తున్నారు. ఆసక్తి రేకెత్తించే ప్రశ్నలు, వినోదం కలిగించే క్రీడలతో ఎపీపోడ్ ఎపీసోడ్ లో మరింత వినోదం యాడ్ చేస్తున్నారు యువరత్న. ఇప్పటికే పొలిటీషియన్లలో చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, సురేశ్ రెడ్డి, లోకేశ్ రాగా హీరో, హీరోయిన్లలో సిద్దూ, విశ్వక్, శర్వానంద్, అడవి శేషు, సీనియర్ హీరోయిన రాధిక, డైరెక్టర్లలో దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు, నిర్మాతల్లో దగ్గుబాటి సురేశ్, అల్లు అరవింద్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు.

తాజా ఎపీసోడ్ కు బాహుబలి

తాజాగా రిలీజ్ చేసే ఎపీసోడ్ లో బాహుబలి ప్రభాస్ కనిపించబోతున్నారంటూ వీడియో గ్లింప్స్ కూడా ఆహా రిలీజ్ చేసింది. అయితే ఆయన తన ఫ్రెండ్ గోపీచంద్ తో కలిసి ఎపీసోడ్ ను పంచుకోనున్నారు. ప్రభాస్ ఒక స్పెషల్ తో షోకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆడియన్స్ తో పాటు టీంకు ఆయన భోజన ఏర్పాట్లు చేస్తున్నారట. ప్రభాస్ ఎపీసోడ్ ను డిసెంబర్ 30 తేదీ టెలీకాస్ట్ చేసేందుకు ఆహా అన్ని ఏర్పాట్లు చేసింది.

తర్వాతి ఎపీసోడ్ లో పవన్ కళ్యాణ్

అన్ స్టాపబుల్ ఎన్‌బీకే 2లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కనిపించబోతున్నారట. ఇప్పటికే ఇది ఖరారైనట్లు తెలుస్తోంది. పవరస్టార్, యువరత్న ఒకే వేధికను పంచుకోవడం ఇదే మొదటి సారని చెప్పాలి. ఏ ఈవెంట్, ప్రోగ్రామ్స్ లో కూడా ఇద్దరూ కలిసి కనిపించలేదు. పవన్ కళ్యాణ్ తో ఈ ఎపీసోడ్ కు పవన్ కు అత్యంత సన్నిహితుడైన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సైలెంట్ గా ఉండే పవన్ ను బాలకృష్ణ ఏ మేరకు మాట్లాడిస్తారో చూడాలి మరి.

అన్ని కోణాల్లో ప్రశ్నించే ఛాన్స్

బాలయ్య పవన్ కళ్యాణ్ ఎపీసోడ్ లో ఆయన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ప్రశ్నలు వేస్తాడని రూమర్స్ వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం స్టార్ కావడంతో పాటు పొలిటికల్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయంగా మరికొన్ని ప్రశ్నలడిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ తో ఫ్రెండ్ షిప్, ప్రస్తుత సినిమాలు తదితరాల పై ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.