ఎన్టీఆర్ సినిమాకి ఆస్తులు అడిగిన శ్రీదేవి కూతురు..!

0
604

#RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ టాలీవుడ్ నుండి పాన్ ఇండియా లెవెల్ కి పాకింది. ఆయనతో సినిమా అంటే ఇప్పుడు వందల కోట్ల రూపాయిల వ్యవహారమే. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ తో చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెల్సిందే. ప్రకటన అయితే చేసారు కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి ఒక్క కార్యక్రమం కూడా ముందుకు కదలలేదు.

గుమ్మడి కాయ కొట్టేసాడట

కనీసం పూజ కార్యక్రమాలకు కూడా ఈ సినిమా నోచుకోకపోవడం తో మూవీ అట్టకెక్కింది అంటూ రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్ కి చెక్ పెడుతూ వెంటనే నందమూరి ఆర్ట్స్ స్పందించి త్వరలోనే షూటింగ్ ప్రారంభం అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కి గుమ్మడి కాయ కొట్టేసాడట కొరటాల శివ. అతి త్వరలోనే పూజ కార్యక్రమాలు ప్రారంభించి ఫిబ్రవరి నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరగబోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

డిమాండ్ చేసిందట

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది వరకే ఆమెని మూవీ టీం సంప్రదించారట. ఆమె నటించడానికి ఒప్పుకుంది కానీ, నాలుగు కోట్ల రూపాయలకు పైగా పారితోషికం ని డిమాండ్ చేసిందట. 70 శాతం అడ్వాన్స్ ఇస్తేనే కాల్ షీట్స్ ఇస్తాను అని చెప్పిందట. ప్రస్తుతం ఇంకా చర్చల దశలోనే ఉంది. జాన్వీ కపూర్ కి ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉందంటూ అనేక ఇంటర్వూస్ లో తెలిపిన సంగతి తెలిసిందే.

సౌత్ లో అనిరుథ్ హవా

అలాంటిది ఎన్టీఆర్ సినిమాలో నటించేందుకు ఇంత పారితోషికం డిమాండ్ చెయ్యడం ఏమిటి అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుథ్ వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం సౌత్ లో అనిరుథ్ హవా ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ఎలా ఉన్నా తన సంగీతం తో , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మరో లెవెల్ కి తీసుకెళ్లడం అనిరుథ్ స్టైల్..ఈ సినిమాకి ఆయన పెద్ద పాజిటివ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.

ప్రభంజనాలకు కేంద్ర బిందువు

ఆచార్య సినిమా తో డీలాపడిన కొరటాల శివ ఈ చిత్రం కోసం ఎంతో కసిగా స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడట. కాబట్టి పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం ప్రభంజనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.