నిర్మాత, నటి పెళ్లిలో ట్విస్ట్

0
2325

గత కొన్ని రోజులుగా ఓ పెళ్లి దేశం మొత్తాన్ని ఆకర్షించింది. ఓ ఇద్దరు తమిళ పరిశ్రమకి చెందిన సెలబ్రిటీలు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. చిత్ర పరిశ్రమకి చెందిన నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ నటి విజే మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. ఇందులో వింత ఏమి లేకపోయినా సదరు నిర్మాత పెర్సనాలిటీ తో పాపులర్ అయ్యాడు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. వీరి ఇద్దరికి ఇదివరకే పెళ్లిళ్లు అయ్యాయి. తాజాగా వీరు ఇద్దరు తమ రెండో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి ఫోటోలు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

ఎన్టీఆర్ ని చూసి నేర్చుకో

లైగర్ సినిమా విడుదలకి ముందు విజయ దేవరకొండ పెద్ద పెద్ద డైలాగ్ లు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదల అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో పలు విమర్శలు వచ్చాయి. అందులో భాగంగానే నిర్మాత చిట్టి బాబుకూడా స్పందించారు. విజయదేవర కొండకి ఒక్కసారిగా స్టార్ డం వచ్చేసరికి.. నోటికి అదుపు లేకుండా పోయిందని అన్నారు. ఒక పద్దతి ప్రకారం మాట్లాడకుండా సినిమాల్లో రౌడీ లాగా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఎన్టీఆర్ ని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.

పెళ్లి తరువాత బాగానే సంపాదించారట..

సమంత, నాగ చైతన్య ల విడాకులు దేశంలోనే సంచలనం రేపిన సంగతి తెలిసిందే. విడాకులు తీసుకొని ఏడాది కావస్తున్నా.. ఇంకా మీడియాలో నానుతూనే ఉన్నారు. ఇక తాజాగా వీరి ఇద్దరికీ సంబందించిన మరో వార్త సోషల్ మీడియాలో హల చల్ చేస్తుంది. వీరి పెళ్లి సమయంలో నాగచైతన్య 40 కోట్ల వరకు సంపాదించాడట. ఇక ఇద్దరూ కలసి ఉన్నప్పుడు దాదాపు 122 కోట్లు వెనుకేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కెరియర్ పరంగా ఇద్దరూ సక్సెస్ అందుకున్నా.. పర్సనల్ లైఫ్ లో మాత్రం ప్లాప్ అవ్వడం విశేషం.