‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ రివ్యూ.. సంక్రాంతికి దుమ్ము రేపడం ఖయమేనా

0
320

లూసీఫర్ రీమేక్ గా వచ్చిన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టకోలేకపోయింది. ఈ నేపథ్యంలో చిరంజీవి తర్వాతి చిత్రం గ్రాండ్ గా ఉండాలని భారీగా ప్లాన్ చేశారు. దీంతో కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో భారీ ప్రాజెక్టుకు ప్రాణం పోయగా అది ‘వాల్తేరు వీరయ్య’గా మన ముందుకు రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విడుదలకు సిద్ధమైన ‘వాల్తేరు వీరయ్య’పై ప్రేక్షకులు, మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి.

ఈ మూవీ సంక్రాంతికి 13 జనవరి, 2023న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ తేదీ దగ్గరపడుతుండడంతో మైత్రీ మూవీ మేకర్స్ రోజుకో అప్ డేట్ ఇస్తూ అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది. ఇటీవల చిరంజీవి స్టైలిష్ లుక్ ఒకటి బయటకు వచ్చింది. భారీ వ్యూవ్స్ తో ప్రస్తుతం సోషల్ మీడియాలో లుక్ అదరగొడుతోంది.

ఉమర్ సింధూ ట్వీట్

‘చుట్టూ గన్స్ మధ్యలో గాగుల్స్ పెట్టుకొని ఉన్న మెగాస్టార్ వీరయ్య’ ఈ పిక్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ నిలిచింది. సంక్రాంతి బరిలో ‘వాల్తేరు వీరయ్య’తో పాటు బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’, విజయ్ నటించిన ‘వారాసు (వారసుడు)’ ఉన్నాయి. ఈ సినిమాల్లో ఏది బాక్సాఫీస్ హిట్ కొడుతుందని ప్రేక్షకుల్లో సర్వత్రా టెన్షన్ నెలకొంటుంది. ఈ నేపథ్యంలోనే ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ రివ్యూను విడుదల చేశారు.

ఇందులో చిరంజీవి స్టయిల్ చూసిన ఒక ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సింధూ స్పందించారు. ‘చిరంజీవి గారూ ఇలాంటి రొమాంటిక్ రోల్స్ మానేసి, సీరియస్ రోల్స్ చేస్తే బెటర్. మిమ్మల్ని ఇలాంటి పాత్రల్లో చూడడం మాకు బోర్ కొట్టింది. ఇది కూడా డిజాస్టర్ కానుంది’. అంటూ ట్వీట్ చేశాడు. ఉమర్ సింధూ ఫిల్మ్ క్రిటిక్ తో పాటు ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు.

పట్టించుకోని మెగా ఫ్యాన్స్

‘ఇప్పుడున్న ప్రేక్షకులకు ఇలాంటి కథలు నచ్చడం లేదు. ఇందులో ఎలాంటి కొత్తదనం లేదు. రొటీన్ కమర్షియల్, రొమాంటిక్ రోల్స్ కాకుండా కొత్తగా ట్రై చేస్తే మంచిది. ఇది ఆకట్టకోలేదు’. అంటూ ఆయన చేసిన ట్వీట్ ను చూసిన మెగా అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అసలే తమ అభిమాన హీరో సెకెండ్స్ ఇన్నింగ్స్ లో రాణించలేకపోతున్నారు. ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ కూడా మూస ధోరణిలో సాగింది. ‘లూసీఫర్’కు వచ్చిన క్రేజ్ గాడ్ ఫాదర్ కు కనిపించలేదు. ఇక ఉమర్ సింధూ ట్వీట్ నేపథ్యంలో ఫాన్స్ వీటిని నమ్మాలా..? నమ్మద్దా..? తెలియకుండా గందరగోళానికి గురవుతున్నారు.

బక్సాఫీస్ బద్దలేనంటున్న ఫ్యాన్స్

అయితే ఇటీవలి కాలంలో ఉమర్ సింధూ ఇస్తున్న రివ్యూలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆయన ఇచ్చిన రివ్యూల ఫలితాలు పూర్తిగా వ్యతిరేఖంగా ఉంటున్నాయి. ఆయన హిట్ అవుతుంది అని రివ్యూ ఇస్తే అది ఫ్లాప్ అయ్యింది. ఆయన ఫ్లాప్ అవుతుంది అని రివ్యూ ఇస్తే అది బాక్సాఫీస్ హిట్ అవుతుంది. ఉమర్ సింధూ ట్వీట్ ను మెగా అభిమానులు పెద్దగా పట్టించుకోవడం లేదని కామెంట్లు వస్తున్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ కూడా నటించారు. ఆయన ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో కనిపించబోతున్నారు. శృతీ హాసన్ హీరోయిన్ గా ఈ చిత్రంలో నటించారు. జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.