సినిమాలో దమ్ము లేకపోతే శివుడైనా ఏమి చేస్తాడు?

0
1808

భీమ్లా నాయక్.. విడుదలైన తోలి రోజు వచ్చిన కలెక్షన్ తప్పితే, ప్లాప్ టాక్ రావడంతో జనాలు థియేటర్ వైపు కూడా చూడడం లేదు. మంగళవారం శివరాత్రి ఉండడంతో కలెక్షన్ లు కనీసం 10 కోట్లు అయినా వస్తాయని ఆశలు పెట్టుకున్నారు చిత్ర టీం. అయితే బ్రేక్ ఈవెన్ కి ఇంకా 35 కోట్లు రావలసిన దశలో శివరాత్రి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే సినిమాలో దమ్ము లేకపోతే శివుడైనా ఏమి చేస్తాడు? శివరాత్రి రోజున 7 కోట్లకు సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మరో మూడు, నాలుగు రోజుల్లో మాయం

దీనితో ఈ చిత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 28 కోట్లు రాబట్టాల్సి ఉంది. అయితే వరుసగా మూడు రోజులు వీక్ డేస్ కావడంతో రోజుకు 2 కోట్లు మించి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీనితో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం అసాధ్యంలా కనిపిస్తుంది. 28 కోట్లు రాకపోతే ఈ చిత్రం ప్లాప్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అప్పటిదాకా భీమ్లా నాయక్ ని సినిమా థియేటర్ లు భరించడం కష్టమే అవుతుంది. దీనితో ఈ చిత్రం మరో మూడు, నాలుగు రోజుల్లో థియేటర్ లో కనిపించక పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ కి డబ్బింగ్ స్టార్ అనే బిరుదు

ఓ వైపు రీమేక్ లేనిదే స్ట్రయిట్ సినిమా తీయడం లేదని పవన్ కళ్యాణ్ పై ఎప్పటి నుండో విమర్శలు వస్తున్నాయి. అయితే సరే పవన్ మాత్రం రీమేక్ అయితే కనీసం యావరేజే టాక్ తో అయినా బయట పడొచ్చని అవే ఎంచుకుంటున్నాడు. ఇలా రీమేక్ లు, డబ్బింగ్ లు తీసుకుంటూ పోతే ఇకపై పవన్ కళ్యాణ్ కి డబ్బింగ్ స్టార్ అనే బిరుదు పడ్డా ఆశ్చర్య పడాల్సిన పని లేదు.

హిట్ కొట్టి దాదాపు 10 ఏళ్ళు

ఈ డబ్బింగ్ సినిమాలను నమ్ముకున్న పవన్ కళ్యాణ్ హిట్ కొట్టి దాదాపు 10 ఏళ్ళు కావచ్చింది. మధ్యలో అడపా దడపా యావరేజి టాక్ లు అందుకున్నా.. సరైన సినిమా పడడం లేదు. `అత్తారింటికి దారేది` చిత్రం తరువాత పవన్ కి ఒక్క బ్లాక్ బస్టర్ లేకపోవడం శోచనీయం. పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో `అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి` నుంచి `భీమ్లానాయక్` వరకు తీసిన సినిమాలలో ఎక్కువ చిత్రాలు రీమేక్ చేసినవే. దీనితో పవన్ కళ్యాణ్ పై రీమేక్ స్టార్, డబ్బింగ్ స్టార్ గా ముద్ర పడిపోతుందని సినీ వర్గాల్లో హాట్ టాపిక్ జరుగుతుండటం విశేషం.