రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహేష్ బాబు, సితార

0
1880

మాములుగా అయితే సెలబ్రిటీలు రోడ్డుపై కనిపించరు. అలా కనిపిస్తే జనాలు వాళ్ళని వదలరు. చుట్టూ గుమ్మి గూడి వారితో సెల్ఫీ అంటూ ఎగబడతారు. ఏ చిన్న సెలబ్రిటీ అయినా ఇదే తంతు. కొంచం పెద్ద సెలబ్రిటీ అయితే ఇక రోడ్డుపై ట్రాఫిక్ జామ్ తప్పదు. వారిని కదలనివ్వకుండా అలానే ఉంచుతారు. మరి అలాంటిది మహేష్ బాబు ఒక్క సారి రోడ్డుపై ప్రత్యక్షం అయితే.. ఎలా ఉంటుంది? ఉహించుకుంటేనే థ్రిల్ గా ఉంటుంది కదూ. అలాంటి ఘటనే ఒకటి తాజాగా చోటుచేసుకుంది.

అక్కడ ఒక్కరు కూడా లేరు

సూపర్ స్టార్ మహేష్ బాబు, అతని కూతురు సితార రోడ్డుపై ప్రత్యక్షం అయ్యారు. మరి ఇద్దరూ ఆలా కనిపిస్తే ఏమైనా ఉందా? జనాలు ఎలా ఎగబడతారో చెప్పాల్సిన పని లేదు. కానీ విచిత్రం ఏమిటంటే.. వారు ఇద్దరూ నడిచి వెళుతున్నా.. అక్కడ ఒక్కరు కూడా లేరు. మరి ఈ విచిత్రం ఎలా జరిగిందంటే.. మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకుఇష్టమైన వీడియోలు పోస్ట్ చేస్తుండడంతో కణాలను అవి ఆకట్టుకుంటాయి. తాజాగా పోస్ట్ చేసిన ఒక వీడియో కూడా వైరల్ అయింది.

సమ్మర్ వాక్ విత్ నాన్న

ఇంతకీ ఆ వీడియో లో ఏమి ఉందంటే.. మహేష్ బాబు తన కూతురు సితారతో అలా నడుచుకుంటూ వెళుతున్నారు. వీరు ఇద్దరూ తప్ప ఆ రోడ్డుపై ఎవరూ లేరు. ఈ వీడియో కి క్యాప్షన్ ఏమని పెట్టిందంటే..’సమ్మర్ వాక్ విత్ నాన్న. ఫర్ ఎవర్ మై ఫేవరేట్ అంటూ’ పోస్ట్ పెట్టింది. అయితే ఇది ఇండియాలో మాత్రం కాదని స్పష్టంగా తెలుస్తుంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు తండ్రి, కూతురులా లేరని, అన్నా చేల్లిల్ల ఉన్నారని మహేష్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.