ఆడు మగాడ్రా బుజ్జి.. లగ్జరీ లైఫ్.. నాలుగో పెళ్లి

0
6961

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఓ వార్త బాగా వినిపిస్తుంది. అదే సీనియర్ నటుడు నరేష్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడా? అనే వార్త హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ జంట చాలా కాలం నుండి కలసి ఉంటున్నారన్న టాక్ నడుస్తుంది. ఇప్పటికే వీరు ఇద్దరూ ఎన్నో సినిమాలలో కలసి నటించగా. ఆ పరిచయమే వీరి ఇద్దరి మధ్య ప్రేమగా మారిందని తెలుస్తుంది. ఆ పరిచయంతోనే వీరు పెళ్లి కూడా చేసుకుంటున్నారని ఓ వార్త హల్ చల్ చేస్తుంది.

మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడనే టాక్

ఈ వార్త మీడియాలో రావడానికి కారణం లేకపోలేదు. వీరిద్దరూ ఈ మధ్య కలసి వెళ్లి మహాబలేశ్వర్ వెళ్లి ఓ స్వామిజీ ని కూడా దర్శించుకున్నారు. ఈ వార్త బయటికి రావడంతోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త గుప్పుమంది. కాగా ఇప్పటికే ఈ నటుడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడనే టాక్ మీడియాలో ఉంది. తన భార్యలతో విభేదాలు వచ్చి విడాకులు కూడా తీసుకున్నాడు. మంచి లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తున్న నరేష్ కి ఈ వయసులో ఒక తోడు అవసరం. ఉండడం ఎంతైనా అవసరం ఉందని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

15 ఏళ్ల క్రితం కన్నడ నటుడుతో పెళ్లి

ఆ కారణంగానే నరేష్ తనకు బాగా పరిచయం ఉన్న. నటి పవిత్ర లోకేష్ కి పెళ్లి చేకోబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఇక పవిత్ర లోకేష్ ఇప్పటికే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 15 ఏళ్ల క్రితం కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్‌ ని పెళ్లి చేసుకోగా. వారిద్దరూ వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. వీరి ఇద్దరికీ విడాకులు రాగానే. నరేష్ ని పెళ్లి చేసుకుంటుందని వార్త బయటికి వినిపిస్తుంది. ఇదిలా ఉండగా ఈ వార్తని వీరు ఇద్దరూ ఖండించక పోవడం విశేషంగా చెప్పవచ్చు. బయటికి వచ్చేటప్పుడు కూడా వీరు ఇద్దరూ కలసి అందరికీ కనిపిస్తుండడం విశేషం. ఈ విషయంపై వారు స్పందించేదాకా ఒక క్లారిటీ రాదు.