సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ మరో 5 రోజుల్లో మన ముందుకు రాబోతుంది.
త్రివిక్రమ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాపై అటు ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో, ఇటు ఆడియన్స్ కూడా అంతే అంచనాలు పెట్టుకున్నారు.
ఎందుకంటే గతం లో ఈ కాంబినేషన్ చేసిన మ్యాజిక్ మామూలుది కాదు. ‘అతడు’ మరియు ‘ఖలేజా’ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా అద్భుతాలు సృష్టించకపోయినా,
ఆల్ టైం క్లాసిక్స్ గా ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెరిగిపోని ముద్రని వేసాయి.ముఖ్యంగా ఓవర్సీస్ లో అటు మహేష్ బాబు కి ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మంచి బేస్ మెంట్ ని వేసాయి. ఈ సినిమా తర్వాతనే ఓవర్సీస్ లో మహేష్ మేనియా మొదలైంది.
ఈ చిత్రం తర్వాత వచ్చిన ‘దూకుడు’ చిత్రం ఓవర్సీస్ లో ఎలాంటి అద్భుతాలు నెలకొల్పాయి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
అప్పటి నుండి మహేష్ బాబు కి మన టాలీవుడ్ లో స్టార్ హీరోలందరికంటే ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. ఆయన గత చిత్రం ‘సర్కారు వారి పాట’ హాలీవుడ్ సినిమాలు పోటీ ఉన్నప్పటికీ కూడా
నార్త్ అమెరికాలో 1 మిలియన్ పైగా డాలర్లు కేవలం ప్రీమియర్ షోస్ నుండి రాబట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు ‘గుంటూరు కారం ‘ చిత్రం నార్త్ అమెరికా లో ట్రైలర్ కూడా ఇంకా ఆకముందే హాఫ్ మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది.
ఇంకా ప్రీమియర్ షోస్ కి 5 రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా ఈ రేంజ్ గ్రాస్ వచ్చిందంటే, విడుదల సమయానికి కచ్చితంగా రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు ప్రీమియర్ షోస్ నుండి రాబడుతుందని,
ప్రీమియర్ రోజు కచ్చితంగా ‘సలార్’ మూవీ రికార్డుని కొల్లగొడుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు బయ్యర్స్. ఒకవేళ సలార్ మూవీ రికార్డు ని బ్రేక్ చేస్తే మాత్రం మహేష్ బాబు కి పోటీ ఇచ్చే తెలుగు హీరో ఇప్పటికీ ఎవ్వరూ రాలేదు,
ఆయనే ఓవర్సీస్ కి నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఈ సినిమా నార్త్ అమెరికా లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే నాలుగు మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాలి.
ప్రస్తుతం ఉన్న ఊపుని చూస్తూ ఉంటే మొదటి వీకెండ్ పూర్తి అయ్యేలోపే బ్రేక్ ఈవెన్ అవుతుందని అనిపిస్తుంది, చూడాలి మరి.