కార్తికేయ న్యూ మూవీ టీజర్ కు సూపర్ వ్యూవ్స్

0
223

కథకు తగ్గట్టు ఎలాంటి పాత్రలైన ఓకే అంటున్న నటులల్లో ముందు వరుసలో ఉంటాడు కార్తికేయ. ఇటీవల కొన్ని సినిమాలలో ప్రతి నాయకుడి పాత్రలను సైతం నాయకుడికి రేంజ్ మెప్పించిన ఆయన కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘బెదురు లంక 2012’ తో హీరోగా వస్తున్నట్లు చెప్పాడు. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. దీనికి విపరీతమైన ట్రోల్ వచ్చాయి. బ్యాక్ గ్రౌండ్ లో ‘వచ్చాడ్రా.. శవుడచ్చాడ్రా’ అంటూ వచ్చే మాటలు పోస్టర్ కు మరింత హైప్ తెచ్చిపెట్టాయి.

కథ విషయంలో మంచి స్కోప్

‘ఆర్ఎక్స్100’తో వెండితెరకు పరిచయమైన నటుడు కార్తికేయ గుమ్మకొండ. అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీతో ఆయనకు ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఎక్కువగా అమ్మాయిలు ఆయనకు ఫ్యాన్స్ అయ్యారు. తర్వాత హిప్పీ, గుణ-369, 90 ఎంఎల్ లాంచి చిత్రాల్లో నటించిన ఆయన మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. మధ్యలో హీరోగా ప్రాజెక్టులు దొరకకపోవడంతో తనకు సరిపోయే పాత్రలపై దృష్టి పెట్టాడు. అందులో భాగంగానే తమిళ్ స్టర్ విజయ్ నటించిన ‘వలిమై’, న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’లో ప్రతినాయకుడి పాత్రలను పోషించి షబాస్ అనింపించుకున్నాడు. కేవలం హీరో పాత్రనే కాకుండా కథ విషయంలో మంచి స్కోప్ ఉంటే ఏ పాత్రలో నైనా ఒదిగిపోతూ తన నటనను నిరూపించుకుంటున్నాడు కార్తికేయ.

టీజర్ గురించి

డైరెక్టర్ క్లాక్స్, హీరో కార్తికేయ కాంబోలో వస్తున్న చిత్రం ‘బెదురులంక 2012’ మూవీలో హీరోగా కనిపించబోతున్నాడు. సంప్రదాయాలకు కట్టుబడిని వ్యక్తిగా ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ‘తమ న్యూ ఎగ్జైట్‌మెంట్ ప్రాజెక్టును మీతో పంచుకునేందుకు ఆగలేకపోతున్నా’ అంటూ ఆయన టీజర్ కు ట్వీట్ చేశాడు. కండలు తిరిగిన దేహంతో, చిరునవ్వుతో, సాధారణ దుస్తుల్లో కనిపించాడు కార్తికేయ. బ్యాగ్రౌండ్లో వినిపించే ‘వచ్చాడ్రా.. శివుడచ్చాడ్రా’ అంటూ వినిపించే సాంగ్ మరింత ఆకట్టుకుంది. గోదావరి నేపథ్యంలో కామెడీ టచ్ లో సాగే ఈ కథలో ఎమోషన్స్, ఇంట్రస్టింగ్ సీన్స్ కూడా ఉంటాయని చిత్ర యూనిట్ చెప్తుంది.

కార్తికేయతో జోడి

‘లౌక్యం ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుంది. ‘కలర్ ఫొటో’ మూవీ తీసి నేషనల్ అవార్డు అందుకున్న ప్రొడ్యూసర్ రవీంద్ర బెనర్జీ ఈ మూవీకి కూడా నిర్మాతగా వ్యవహరించారు. డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి ఇందులో కార్తికేయతో జోడి కట్టింది. దీనికి మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా, గీత రచయిత స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్ర్తి కలం నుంచి జాలు వారిన ఒక గీతాన్ని ఇందులో చిత్రించడం కొస మెరుపు. అజయ్ ఘోష్, అయ్యంగార్, శ్రీకాంత్, కసిరెడ్డి రాజ్ కుమార్, సత్య, ఆటో రాం ప్రసాద్, రమణ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

నిర్మాణం చివరి దశకు

‘బెదురులంక 2012’ టైటిల్ ను నిర్మాత బెనర్జీ, దర్శకుడు క్లాక్స్ సెప్టెంబర్ 21న (కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా) ప్రకటించారు. ఒక పల్లెటూరిలో జరిగే కథ ఇదని, ఆద్యంతం ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం నిర్మాణం చివరి దశకు చేరుకున్నట్లు చెప్పారు. ఫొటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ మూవీకే హైలట్ గా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ సినిమా ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంలోకి తీసుకెళ్తుందని దర్శక, నిర్మాతలు చెప్పారు. వచ్చే ఏడాది థియెటికల్ రిలీజ్ చేస్తామని చెప్పిన వారు. డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ సినిమాతో కార్తికేయ ఇండస్ర్టీకి మరో హిట్ ఇవ్వబోతున్నాడని ఆయన అభిమానులు, సినీ విశ్లేషకులు కూడా టీజర్ కు కామెంట్లు పెట్టడం కొస మెరుపు.