ఆరుగురు పతివ్రతలు హీరోయిన్ ఎక్కడ ఉందొ తెలుసా

0
845

హీరోల కెరీర్ కంటే హీరోయిన్ల కెరీర్ అతి తక్కువని చెప్పచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తరాల నుంచి కనిపించిన హీరోలు ఉన్నారు కానీ తరాల నుంచి కనిపించిన హీరోయిన్ల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. హీరోయిన్ల విషయంలో గ్లామర్ కారణం కావచ్చు. మొదట కొన్ని చిత్రాల్లో కనిపించిన గ్లామర్ తర్వాతి చిత్రాల్లో మిస్సయితే డైరెక్టర్, ప్రొడ్యూసర్ చాన్స్ లు ఇచ్చేందుకు ఇష్ట పడరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే వారిని చూస్తారట.

ఒక సాంగ్ చేసి కెరీర్ ను నాశనం

హీరోయిన్ గా వెలుగు వెలిగిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయలేక ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోతుంటారు. మరి కొందరు హీరోయిన్లు కెరీర్ పీక్ లో ఉండగా అర్థం పర్థం లేని డిషిజన్లు తీసుకుంటూ ఐటం గర్ల్స్ గా మిగిలిపోతుంటారు. ఛార్మి కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో ఐటం గర్ల్ గా ఒక సాంగ్ చేసి కెరీర్ ను నాశనం చేసుకుంది. మరికొందరు హీరోయిన్ల తమకు సరిపడా చిత్రాలు రాకపోవడంతో ఇండస్ట్రీని వదులుకుంటారు. మూడో కోవలేకే వస్తుంది నటి అమృత.

తక్కువ చిత్రాల్లో నటించిన అమృత

హీరోయిన్ అమృత గురించి చాలా మందికి తెలిసే అవకాశం లేదు. ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు ఒకటి, రెండు చిత్రాల్లో మాత్రమే కనిపించింది. మొదటి చిత్రం హిట్ కావడంతో మరో చిత్రంలో నటించే అవకాశం వచ్చినా మొదటి చిత్రంలోని పాత్ర తరహాలోనే ఉంది. ఇలాంటి పాత్రలతోనే నెగ్గుకు రావడం కష్టమని భావించి ఆమె ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

‘ఆరుగురు పతివ్రతలు’ ఫేమ్

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ హిట్ అండ్ ఫ్లాప్ ల మధ్య ఊగిసలాడుతుంది. ఎప్పుడు ఏ హీరోయిన్ కు మంచి అవకాశాలు వచ్చి స్టార్ గా నిలుస్తుందో.. ఎప్పుడు ఏ హీరోయిన్ ఫ్లాప్ లను ఎదుర్కొని ఇండస్ట్రీకి దూరం అవుతుందో చెప్పడం కష్టమే. ఈవీవీ దర్శకత్వంలో 2004లో వచ్చిన సినిమా ‘ఆరుగురు పతివ్రతలు’ ఈ మూవీలో సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియాలోని వివిధ ఫ్లాట్ ఫారమ్ లలో చెక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇందులో ఇటు మగతనం లేని మొగుడు, సుఖ పెట్టే ప్రియుడి మధ్య నలిగిపోతూ కనిపించిన పాత్రలో నటించారు అమృత.

2009లో కెరీర్ కు ఫుల్ స్టాప్

కన్నడ చిత్ర పరిశ్రమ (శాండల్ వుడ్)కు చెందిన ఈ హీరోయిన్. మొత్తంగా (కన్నడ, తెలుగు) 8 సినిమాలలో మాత్రమే నటించింది. 2004లో సినీ కెరీర్ ప్రారంభించిన ఆమె 2009లో కన్నడ చిత్రం ‘జోడీ నెంబర్ 1’లో నటించి ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయింది. ఒక్క చిత్రంతో బాగా ఫేమ్ అయిన అమృత తన తర్వాతి చిత్రాల్లో కూడా అదే తరహా పాత్రలు వస్తుండడంతో ఆమెకు నచ్చక వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకొని ఆనందంగానే ఉన్నారట.

బాగా ఎంజాయ్ చేస్తున్నారట

బెంగళూర్ లో గృహిణిగా దాంపత్య జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారట. ఆమెలోని నటనను బయటకు తీయడంలో డైరెక్టర్లు పూర్తిగా విఫలమయ్యారన్న వార్తలు వినిపించాయి. ఒక్క ఈవీవీ మాత్రమే ఆమెలోని నటనను చూశారని కొందరు నెటిజన్లు కూడా అప్పట్లో తమ అభిప్రాయాలు తెలిపారు.