భోగినాడు మొదలై… కనుమనాడు పూర్తయ్యే నా సామిరంగ?

0
354
Na Samiranga which starts on Bhoginaduand ends on Kanumanadu

సెంటిమెంట్‌లేని మనిషి ఉండడు అంటే నమ్మి తీరాల్సిందే. ముఖ్యంగా ఈ సెంటిమెంట్‌ సెలబ్రిటీలకు మరీ ఎక్కువ. సినిమా జనాలకైతే ఇక చెప్పక్కర్లేదు. కథ వినటానికి సెంటిమెంట్‌..

అడ్వాన్స్‌లు ఇవ్వటానికి సెంటిమెంట్‌.. ముహూర్తానికి సెంటిమెంట్‌… ప్రమోషన్‌ స్టార్ట్‌ చేయటానికి సెంటిమెంట్‌… విడుదలకు సెంటిమెంట్‌.. ఇలా సెంటిమెంట్‌తో పుట్టి..

సెంటిమెంట్‌తో విడుదలయ్యేదే సినిమా. ఇక మన తెలుగు సినిమా దర్శక, నిర్మాతలకు ఈ సెంటిమెంట్‌ అంటే.. చెప్పలేనంత సెంటిమెంట్‌.

అందుకే అతి తక్కువ సమయంలో అతి ఎక్కువగా కలెక్షన్‌లు కురిపించే సంక్రాంతి అంటే అంత సెంటిమెంట్‌. అలాగే ఈ సంక్రాంతికి కూడా అటు మహేష్‌బాబు నటించిన ‘గుంటూరు కారం’ ఇటు వెంకటేష్‌ నటించిన ‘సైంధవ్‌’,

తేజ సజ్జ నటించిన ‘హనుమాన్‌’లో పాటు నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నాలుగు వేటికవే ప్రత్యేకమైన జోనర్‌లో,

The movie Guntur Karam proved that Mahesh is the next person in overseas

భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవే. అయితే నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ సినిమా సంక్రాంతి సినిమాల్లో అలజడి రేపుతోంది. నూతన దర్శకుడు విజయ్‌ బిన్ని దీనికి దర్శకుడు.

చిట్టూరి శ్రీనివాస్‌ నిర్మాత. తొలుత ఈ సినిమాను జనవరి నెలాఖరుకు విడుదల చేద్దామని షెడ్యూల్‌ చేశారు. అయితే ఈ సినిమా కథ భోగినాడు మొదలై.. కనుమనాడు ముగుస్తుందట.

కాబట్టి దీన్ని సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయాలని డిసైడ్‌ అయి ప్రీపోన్‌కు వచ్చారు. జగనవరి 14న విడుదల చేస్తున్నారు.

సంక్రాంతికి సంబంధించిన కంటెంట్‌తో పాటు, నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్‌ బాగా వర్కవుట్‌ అవ్వటం, అలాగే యువ హీరోలు అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌లు ఉండటం ఈ సినిమాకు మంచి గ్లామర్‌ తెచ్చిపెట్టింది.

దీనికి తోడు 45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కడం వల్ల కేవలం సంక్రాంతి వంటి బిగ్‌ అకేషన్‌లో దూరితేనే వెంటనే రికవరీ సాధ్యం అన్న ఆలోచనతో నిర్మాత

చిట్టూరి శ్రీనివాస్‌ జనవరి 14న విడుదల చేయటానికి డిసైడ్‌ అయ్యారు. అందుకే ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఎంత రిక్వెస్ట్‌ చేసినా ఆయన తగ్గేదేలే అన్నారట.