‘లవ్ టుడే’ రివ్యూ

0
305

లవ్ ట్రాక్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలకు అన్ని తరాల ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇందులో భాగంగానే వచ్చిన సినిమా ‘లవ్ టుడే’. ఈ మూవీ గత శుక్రవారం (నవంబర్ 25)న విడుదలైంది. కథ కథనం కొత్తగా ఉండడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంతకీ మూవీలో ఏముందే ఓ లుక్కేదాం..

డైరెక్టరే హీరో

డైరెక్టరే హీరోగా వస్తున్న చిత్రాలు హిట్లుగా నిలుస్తున్నాయి. రీసెంట్ గా రిశబ్ షెట్టి కాంతారా డైరెక్ట్ చేసి యాక్ట్ చేయగా అది పాన్ ఇండియా లెవల్ లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇంత పెద్ద హిట్ టాక్ ను సొంతం చేసుకోలేకపోయినా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది ‘లవ్ టుడే’. ఈ సినిమాను ప్రదీప్ రంగనాథన్ డైరెక్ట్ చేస్తూ హీరోగా కూడా చేశాడు. ప్రజెంట్ యూత్ థింకింగ్, లవ్, ఎమోషన్స్ నేపథ్యంలో ఈ కథను మలిచాడు ప్రదీప్. తమిళంలో వచ్చిన ఈ సినిమాను తెలుగులో డబ్ చేయగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దీన్ని సమర్పించాడు. భారీ బ్యానర్ అయిన ‘శ్రీ వేంకటేశ్వర మూవీస్’పై ఈ చిత్రం రిలీజ్ కావడంతో ఆడియన్స్ ఆ మేరకు చిత్రంపై అంచనాలు పెంచుకున్నారు. మూవీ కూడా వారిని ఆకట్టుకుంటూ సాగింది.

స్టోరీ గురించి చూద్దాం

ప్రదీప్ రంగనాథన్ డైరెక్ట్ చేసి హీరోగా నటించిన ఈ చిత్రంలో హీరో ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్) ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్, హీరోయిన్ నిఖిత (ఇవానా) లవ్ లో పడతారు. పెండ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఈ నేపత్యంలో పెండ్లిపై తన తండ్రిని కలవాలని హీరోయిన్ చెప్తుంది. దీంతో హీరో హీరోయిన్ తండ్రి వేణు శాస్ర్తి (సత్యరాజ్)ని కలుస్తాడు హీరో. వారి ప్రేమను అంగీకరిస్తూనే ఒక కండీషన్ పెడతాడు శాస్ర్తి. వన్ డే ఒకరి సెల్ ఫోన్ మరొకరి చేతిలో ఉండాలని చెప్తాడు. తర్వాత కథ ఏంటి. ఒకరి ఫోన్ లో మరొకరు ఏం చూస్తారు..? తర్వాత వారు పెండ్లి చేసుకుంటారా..? అన్నది సినిమాలో చూడాల్సిందే.

ఎలా ఉంది

ట్రైలర్ చూసిన ప్రేక్షకుడు మూవీపై ఒక అంచనాకు వస్తాడు. దాదాపు అంతా ట్రైలర్ లోనే చూపించాడు దర్శకుడు. మరి సెల్ ఫోన్ చేంజ్ అంశం చుట్టూ కథ ఎలా తిరుగుతుంది హీరో హీరోయిన్లు చివరికి పెళ్లి చేసుకుంటారా అనే సందేహంతో సినీ అభిమానులు సినిమాలో చూడాల్సిందే. ప్రస్తుతం యూత్ కు కనెక్ట్ అయ్యే కథను ఎంచుకున్నారు ప్రదీప్. ఒకరి వ్యక్తిత్వం ఏంటో వారి సెల్ ఫోనే చెప్తుందని తరుచూ చెప్పే మాట. దీన్నే బేస్ చేసుకున్న డైరెక్టర్ ఈ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కేవలం 10 నిమిషాల్లోనే స్టోరీలోకి తీసుకెళ్తుంది. దీనికి హస్యాన్ని కలిపి జోడించి చేసిన మేకింగ్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఒకరి సెల్ ఫోన్లో మరొకరు చూసిన చాటింగ్, బ్రౌజింగ్ తర్వాత వారు ఎలా మారారు. వారిలో కలిగే భావోద్వేగాలు.. సినిమాకు హైలట్ గా నిలిచాయి.

పర్ఫార్మెన్స్

ఈ సినిమాలో ఈ జోడీతో పాటు మరో జోడీ కూడా ఉంటుంది. వారితో కూడా హాస్యాన్ని పండించారు డైరెక్టర్. సెకండ్ ఆఫ్ కొంచెం లాగ్ ఉన్నా, కథలో కలిసిపోతుంది కాబట్టి అంతగా లాగ్ అనిపించదు. డైరెక్టర్ ప్రదీప్ రంగనాథ్ హీరోగా ఆకట్టుకున్నాడు. పాత్రకి తగ్గట్టుగా నటించి మెప్పించాడు. హీరోయిన్ ఇవానా కూడా మంచి అభినయంతో క్యారెక్టర్ కు తగ్గ న్యాయం చేసింది. శాస్ర్తీగా సత్యరాజ్ పాత్ర నిడివి తక్కువగా ఉన్నా పర్ఫార్మెన్ లో మాత్రం ఆకట్టకున్నాడనే చెప్పాలి. నటి రాధిక కథానాయకుడి తల్లి పాత్ర పోషించింది. రవీనా, యోగిబాబు పాత్రలు మూవీకి ప్రధాన బలంగా నిలిచాయి.

ప్లస్ లు: కామెడీ, స్టోరీ, స్ర్కిప్త్,
మైనస్ లు: సెకండ్ ఆఫ్ లో లాగ్, కొన్ని సన్నివేశాలు

రేంటింగ్: 4/5