పవిత్ర లోకేశ్, నరేశ్ మరో ట్విస్ట్.. కీలక మలుపు

0
360

సినీ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ విషయంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తనపై అసత్య ప్రచారం చేస్తున్నాయని, ట్రోల్ చేస్తున్నారని నటి పవిత్ర లోకేష్ సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు ఛానల్స్ కు, వెబ్ సైట్లకు నోటీసులు జారీ చేశారు. పవిత్ర లోకేష్ పిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది.

వివాహం చేసుకున్నారని ప్రచారం

తాము సహ జీవనం చేస్తున్నామని పవిత్ర లోకేష్-నరేష్ మీడియా ముందు నేరుగా ప్రకటించిన విషయం తెలిసిందే. నరేశ్ తన మూడో భార్య రమ్య రఘుపతితో విడిపోయి పవిత్ర లోకేష్ కి దగ్గరయ్యారు. పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ని నరేష్ వివాహం చేసుకున్నారని ప్రచారం సాగింది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఆలయం సందర్శించిన ఈ జంట పూజలు చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటి ఆధారంగా నరేష్-పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్నారని పుకార్లు వ్యాపించాయి.

మనిషి తోడు కావాలి

వరుస కథనాల నేపథ్యంలో నరేష్ మీడియా ముందు వివరణ ఇచ్చారు. తాము పెళ్లి చేసుకోలేదని చెప్పారు. వివాహ వ్యవస్థపై నమ్మకం లేదని, ప్రతి పది జంటల్లో 8 జంటలు విడిపోతున్నయన్నారు. నమ్మకమైన మనిషి తోడు కావాలి.. పవిత్ర లోకేష్-నేను కలిసి ఉంటున్నామే తప్ప పెళ్లి చేసుకోలేదని చెప్పుకొచ్చాడు నరేష్.

అయితే నరేష్(Naresh)-పవిత్రల బంధాన్ని మూడో భార్య రమ్య రఘుపతి తప్పుబట్టారు. అధికారికంగా విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో సంబంధం పెట్టుకున్నారని, ఇది అక్రమమంటూ మీడియా ఎదుట వాపోయారు. ఈ వ్యవహారంపై నరేష్ మీద ఆమె న్యాయపోరాటం చేస్తున్నట్లు తెలుస్తున్నది.

పనిగట్టుకొని ప్రచారం

తమపై పనిగట్టుకొని కొదరు దుష్ప్రచారం చేస్తున్నారని పవిత్ర లోకేష్-నరేశ్ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు. నిరాదార కథనాలు ప్రసారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్, మీడియా సంస్థలపై కొన్ని ఆధారాలతో ఫిర్యాదు చేశారు. పిటిషనర్ ఫిర్యాదు ఆధారంగా ఛానల్స్ పై విచారణ చేపట్టాలని నాంపల్లి కోర్టు.. సైబర్ పోలీసులను ఆదేశించింది.

ఈ క్రమంలో కొన్ని వెబ్ సైట్లు న్యూస్ చానళ్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పవిత్ర లోకేష్ నవంబర్ 26న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి.. కొన్ని వెబ్ సైట్లు తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ప్రైవసీకి ఇవన్నీ భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.