ఆ పెళ్లితోనే కార్తీక్ జీవితం నాశనమైందా..?

0
1111

మురళీ కార్తికేయన్ ముత్తురామన్ ముందటి తరం నటుడే అయినా చాలా మంది సినీ అభిమానులకు కార్తీక్ గా సుపరిచితుడే. ఆయన నటనతో పాటు గాయకుడు కూడా, రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారాయన. ఆయన తండ్రి కూడా ఆర్ ముత్తురామన్ గా మనకు సుపరిచితమైన హీరోనే. 1980 నుంచి 1990 వ దశకంలో ఆయన ఒక స్టార్ హీరో. అప్పుడున్న హీరోలలో మొదటి వరుసలో ఉండేవారు కార్తీక్. కార్తీక్ తండ్రి నటుడే అయినా ఇతను మాత్రం సినిమాల్లో రాణించేందుకు బాగా కష్టపడ్డారనే చెప్పాలి.

భారతీ రాజా డైరెక్షన్ లో వచ్చిన ‘అలైగల్ ఓవాతిల్లై (1981)’ కార్తీక్ మొదటి సినిమా. ఇతన్ని తమిళ ఇండస్ట్రీలో ‘నవరస నాయగన్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాణించాడు కార్తీక్. ‘సీతాకోక చిలుక’, ‘అన్వేషణ’, ‘మగరాయుడు’తో పాటు మరిన్ని చిత్రాల్లో నటించి మెప్పించారు. నవరస నాయగన్ గా గుర్తింపు దక్కించుకున్న ఆయన ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయేవారు. దాదాపు 125కు పైగానే చిత్రాల్లో నటించాన ఆయన తమిళనాడు పలు అవార్డులను ఇచ్చి సత్కరించింది.

కార్తీక్ కు గోల్డెన్ డేస్

ఒక దశలో కార్తీక్ కు గోల్డెన్ డేస్ నడిచాయి. ఆ దశలో ఆయన అనేక చిత్రాల్లో నట్టించి మెప్పించాడు. అవన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిపోయాయి. అనేక మంది స్టార్ డైరెక్టర్లు ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపేవారు. 1887 నుంచి 1991 వరకు ఆయనకు కోలివుడ్ లో ఎదురేలేదని చెప్పాలి. ఆ తర్వాత కొన్ని ఒడుదుడుకులను ఎదుర్కొన్నారు కార్తీక్ 1992 నుంచి ఆయన సినిమాలు ప్రజా ధరణను పొందలేదు సరికదా కొన్ని చిత్రాలు ప్రజాగ్రహానికి గురయ్యాయి. కార్తీక్ మంచి గాయకుడు కావడంతో ఆయన అమరన్ (1992) చిత్రంలో పాడిన పాట తీవ్ర విమర్శలకు దారి తీసింది. 1992 నుంచి 1995 వరకూ భారీ హెచ్చు తగ్గులను చూశారు కార్తీక్.

రాతితో రెండో పెళ్లి

ఇక ఆయన వైవాహిక జీవితానికి వస్తే కార్తీక్ తో కలిసి ‘సోలైకుయిల్’లో నటించిన రాగిణిని ఆయన 1988లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు గౌతమ్, ఘైన్ ఉన్నారు. కొన్నాళ్లు కలిసే ఉన్న వీరి విడిపోయారు. తర్వాత రాగిణి చెల్లెలు అయిన రాతిని 1992లో రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు పుట్టగా ఆయన పేరు తిరన్ గా పెట్టుకున్నారు.

పతనం వైపునకు అడుగులు

2000 ప్రారంభం నుంచి ఇండస్ట్రీలో మెల్లగా పతనం వైపునకు కార్తీక్ దారులు పడడం ప్రారంభమైంది. అప్ కమింగ్ హీరోలు రావడం. వారిని ధీటుగా ఎదుర్కొనేందుకు ఆయన శ్రమించినా ఫలితం దక్కకపోవడంతో కోలివుడ్ ఇండస్ట్రీకి దూరంగా వెళ్లారు. ఆ సమయంలో కూడా కొన్ని చిత్రాల్లో నటించినా అనుకున్న ఆదరణ మాత్రం దగ్గలేదు. ఇంకా కొన్ని సినిమాలు ఆడియో మాత్రమే విడుదల కాగా చిత్రాలు మాత్రం విడుదల కాలేదు. ఇక 2006 నుంచి రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు కార్తీక్.

‘ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్’ పార్టీలో చేరి తమిళనాడు రాష్ర్ట కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించాడు. స్థానిక ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు. తర్వాత ‘అహిళ ఇండియా నాదలుమ్ మక్కల్ కట్చిని’ అనే పార్టీని స్థాపించి విరదునగర్ నుంచి 2009లో ఎంపీగా బరిలోకి దిగారు. కానీ ఆయనకు 15వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. సీని జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మరిన్ని మంచి కథలను ఎంపిక చేసుకొని ఉంటే బాగుండేదని కార్తీక్, సినీ అభిమానులు అనుకుంటున్నారు.