కీరవాణి కొడుకుతో మురళీ మోహన్ మనవరాలు పెళ్లి

0
355
keeravani murali mohan

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండడం తో ఎక్కడ చూసినా పెళ్లి సందడే కనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న పరిసరాల్లో మాత్రమే కాదు, టాలీవుడ్ లో కూడా వరుసగా పెళ్లిళ్లు జరుగుతూ ఉన్నాయి. చాలా కాలం నుండి బ్యాచిలర్ జీవితాన్ని గడుపుతున్న ఎంతో మంది హీరోలు మరియు హీరోయిన్లు రీసెంట్ గానే పెళ్లిళ్లు చేసుకొని తమ బ్యాచిలర్ జీవితాలకు టాటా చెప్పేస్తున్నారు.

ఇప్పుడు రీసెంట్ గా కీరవాణి కొడుకు శ్రీ సింహా కూడా పెళ్లి పీటలు ఎక్కబోతునట్టుగా అధికారికంగా ఖరారు అయ్యింది. యమదొంగ సినిమాలో బాలనటుడిగా వెండితెర కి పరిచయమైనా శ్రీ సింహా, ఆ తర్వాత పెద్దయ్యాక ‘మత్తు వదలరా’, ‘దొంగులున్నారు జాగ్రత్త’, ‘ఉస్తాద్’ మరియు ‘తెల్లవారితే గురువారం’ వంటి చిత్రాల్లో హీరోగా నటించాడు. వీటిల్లో ‘మత్తు వదలరా’ చిత్రం పెద్ద హిట్ అయ్యింది.

keeravani murali mohan

చిరు సిగరెట్‌ కృష్ణంరాజుగారి జేబులో

మిగిలిన సినిమాలన్నీ పెద్దగా ఆడకపోయినా కూడా శ్రీ సింహా కి నటుడిగా మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఇకపోతే శ్రీ సింహా త్వరలోనే మురళి మోహన్ మనవరాలు రాగ తో పెళ్లి జరగబోతున్నట్టు గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది. మురళి మోహన్ కి రామ్ మోహన్ అనే కుమారుడు ఉన్నాడు. ఆయనకీ రాగ అనే ఏకైక కుమార్తె ఉంది.

కొద్దిరోజుల క్రితమే ఆమె బిజినెస్ మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం మాగంటి పెద్ద వ్యాపార సామ్రాజ్యమే ఉంది. రాగ అందులోనే కీలక బాధ్యతలు చేపడుతూ ముందుకు దూసుకెళ్తుంది. అయితే సోషల్ మీడియా లో ప్రచారమైన ఈ వార్తలపై మురళి మోహన్ మీడియా తో మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ ‘అవును నా మానవరాలితో త్వరలోనే కీరవాణి కొడుక్కి పెళ్లి కాబోతుంది.

ఫిబ్రవరి 14 వ తేదీన వీళ్లిద్దరికీ వివాహం చెయ్యాలని నిశ్చయించుకున్నాం. నాకు ఒక కూతురు మరియు ఒక కొడుకు ఉన్నారు. కూతురుకి విదేశాల్లో స్థిరపడింది. ఆమెకి ఒక అమ్మాయి సంతానం ఉంది, ఆమెకి కూడా పెళ్లి నిశ్చయం అయ్యింది. ఇలా ఒకేసారి నా మనవరాళ్లు ఇద్దరు పెళ్లి చేసుకోబోతుండడం నాకు ఎంతో ఆనందాన్ని కలుగచేస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు మురళీ మోహన్.

ఈ వివాహానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియచేయనున్నారు. అయితే ఇది ప్రేమ వివాహమా, పెద్దలు కుదిరించిన వివాహమా అని మురళీ మోహన్ ని అడగగా, ఇది పెద్దలు కుదిరించిన వివాహమే అని ఆయన క్లారిటీ ఇచ్చాడు.