పుష్ప ‘రీ రిలీజ్’.. తగ్గేదేలే.. డేట్ ఎప్పుడంటే..?

0
2029

అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప మూవీకి ముందు.. పుష్ప మూవీకి తర్వాత అని చెప్పుకోవాలి. పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీ సాధించిన సంచలనాలు అన్నీ.. ఇన్నీ.. కావు. పుష్ప-2కు రిలీజ్ కు లేటవుతుందని మరో సారి ‘పుష్ప’ ను థియేటర్లలో ‘రీ రిలీజ్’ చేసుకుంటున్నారంటే అల్లు అర్జున్ లెవల్ ఏంటో తెలుస్తోంది. కేరళీయులు అల్లు అర్జున్ ను ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు.

హిందీలో రూ. 100 కోట్లకు పైగానే

పుష్ప మూవీకి ముందు అల్లు అర్జున్ తీసిన ఆర్య, దేశ ముదురు, బన్నీ, రేసుగుర్రం, తదితర చిత్రాలు తెలుగునాట ప్రేక్షకులను ఆకట్టుకుంటే తర్వాత వచ్చిన పుష్ప పాన్ ఇండియా లెవల్ లో అర్జున్ కు ఫ్యాన్స్ ను సంపాదంచి పెట్టింది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాతో అల్లు అర్జున్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. పుష్ప తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, తదితర భాషల్లో రిలీజ్ అయ్యింది. హిందీలో రూ. 100 కోట్లకు పైగానే వసూళ్లను సాధించింది ఈ మూవీ.

బన్నీ ఫ్యాన్స్ ఏర్పాట్లు

ఇక కేరళ ఆడియన్స్ ఈ మూవీని విపరీతంగా ఆదరిస్తున్నారు. పుష్ప2 (ది రూల్) కోసం ఎదురు చూస్తున్నారు. అది ఇప్పట్లో వచ్చేలా లేకపోవడంతో ‘పుష్ప’ను మరోసారి చూద్దాం అని ఫిక్స్ అయ్యారు. మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ డేట్ నే ఇప్పుడు ‘రీ రిలీజ్’కు ఎంచుకున్నారు కేరళ అభిమానులు. ‘డిసెంబర్, 17’ న రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. దీని కోసం బన్నీ ఫ్యాన్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకా నెల వరకు గ్యాప్ ఉండడంతో రీ రిలీజ్ కూడా రిలీజ్ లాగా పెద్ద వేడుకలా చేపట్టాలని ప్లాన్లు చేస్తున్నారు. కేరళలో ఈ రీ రిలీజ్ ఇంకెంత వసూళ్లు చేస్తుందో చూడాలి మరి.