ఉపాసన ప్రెగ్నెన్సీపై కొత్త అనుమానాలు

0
1982

రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడనే న్యూస్ తన తండ్రి చిరంజీవి ఇటీవల ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఆ ఆంజనేయ స్వామి కృపా కటాక్షం వల్ల తనకు మనుమడు రాబోతున్నాడంటూ చెప్పారు. ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ వార్త బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు బాలీవుడ్ పెద్దలు కూడా రామ్ చరణ్ కు విషెస్ చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి. మెగా ఫ్యాన్స్ లో కల్లోలం సృష్టిస్తున్నాయి.

ఆనందంలో మెగా ఫ్యాన్స్

దాదాపు పదేళ్ల తర్వాత మెగా వారి ఇంటి కొత్త సందడి నెలకొంది. ఇది చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా పండగనే చెప్పాలి. తన అభిమాన కుటుంబం బాగుండాలని నిత్యం కోరుకునే ఫ్యాన్స్ కు ఇది నిజంగా తీపి కబురనే చెప్పాలి. చిరంజీవి లెగసీని రామ్ చరణ్ ముందుకు తీసుకెళ్తుండగా, రామ్ చరణ్ లెగసీని ఎవరు ముందుకు తీసుకెళ్తారంటూ కొత కాలంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రశ్నించడం మొదలు పెట్టారు.

అయితే రామ్ చరణ్, ఉపాసన కెరీర్ పరంగా మరింత నిలదొక్కుకునేందుకు కొన్నేళ్లు పిల్లలకు దూరంగా ఉండాలని కూడా అనుకున్నారంట. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ హిట్ తో ఉపాసన కూడా కొన్ని పనులన తగ్గించుకొని పిల్లలను కనేందుకు సిద్ధమయ్యారట. ఆ నేపథ్యంలోనే చిరంజీవి మనకు ఈ న్యూస్ చెప్పారు.

వైరల్ అవుతున్న కామెంట్లు

14 జూన్, 2012లో వివాహం చేసుకున్న ఈ జంట. ఇప్పటి వరకూ ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పలేదు. ఇటీవల వెలువడిన ఈ న్యూస్ పై మొదట ఫ్యాన్స్ సంబురంగా ఉన్నా.. ఇప్పుడు వస్తున్న గాసిప్స్ తో కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంత కాలం ఏదైనా అనారోగ్య పరిస్థితి ఉండి వీరికి పిల్లలు కలుగలేదని, ఇప్పుడు కూడా వీరు సరోగసిని ఆశ్రయించారని కామెంట్లు వస్తున్నాయి.

సరోగసికి వెళ్తారా

అయితే రామ్ చరణ్ తండ్రి అవుతున్నాడన్న వార్తతో మెగా ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఇది సరోగసి అయితే యాంటీ ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం కొంత మంది హీరోయిన్లు సరోగసిని ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కూడా ఆశ్రయించినట్లు రూమర్స్ వస్తున్నాయి. గతంలో సరోగసిలో మంచు లక్ష్మి బిడ్డకు జన్మనివ్వగా.. తర్వాత నయనతార కూడా ఆ పద్ధతిలోనే ఇద్దరికి జన్మనిచ్చింది.

అయితే ఉపాసనా దంపతులు కూడా సరోగసినే ఆశ్రయిస్తే రామ్ చరణ్ వారసులుగా ఫ్యాన్స్ చూడలేరన్న వార్తలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. విశాలమైన భావాలు కలిగి ఉన్న వారికి సరోగసి మామూలు విషయమే అయినా ఇంకా తెలుగు ఫ్యాన్స్ మాత్రం లైట్ గా తీసుకునేలా లేరు.

ఆ ఛాన్సే లేదంటున్న ఫ్యాన్స్

కానీ ఉపాసనకు మాత్రం భారతీయ విలువలు.. సంప్రదాయాలను బాగా పాటిస్తుంది. గతంలో చాలా ఇంటర్వ్యూలలో కూడా ఇవే చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమె అటువైపుగా వెళ్లదని నెటిజన్లు, మెగా ఫ్యాన్స్ చెప్తున్నారు. ఏది ఏమైనా ఇంకొన్ని రోజులు ఆగితేనే ఈ కామెంట్లకు తెరపడుతుందని తెలుస్తోంది.