యాంకరింగ్ కు సుమ గుడ్ బై..!

0
241

దాదాపు మూడు దశాబ్ధాల సుధీర్ఘ ప్రయాణం తర్వాత యాంకర్ సుమ ఒక నిర్ణయం తీసుకుంది. ఇక తను యాంకరింగ్ చేయనని చెప్పింది. ఈ విషయం విన్న బుల్లితెర నుంచి వెండితెర వరకూ అంతరు షాక్ కు గురయ్యారు. యాంకర్లకు కూడా అభిమానులు ఉంటారని మొదట నిరూపించింది సుమనే. ఆమె ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శవంతమనే చెప్పాలి. తన మాతృభాష కాకున్నా ఆరాధిస్తూ అందరి మన్ననలు పొందుతూ అక్షరం తడబకుండా ప్రముఖులను సైతం ఆశ్చర్యానికి గురి చేసిన సుమ ఇక బుల్లితెరపై కనుమరుగవుందనే వార్తను ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. అసలు ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

మూడు దశాబ్ధాల సుధీర్ఘ ప్రయాణం

టీవీ యాంకర్లలో ఇంత సుధీర్ఘ ప్రయాణం ఎవరూ చేయలేరనే చెప్పాలి. సుమ 22 మార్చి, 1974లో కేరళలోని పాలక్కాడ్ లో జన్మించారు. పదేళ్ల తర్వాత నారాయణ కుట్టి నాయర్-పల్లస్సన పచ్చువీట్టిల్ విమలకు పుట్టింది సుమ. పుట్టినప్పటి నుంచి అల్లారుముద్దుగా పెరిగింది. ఆమె తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో బదిలీలు కామనే ఇందులో భాగంగా సికింద్రాబాద్ లో ఉద్యోగం చేస్తూ అక్కడే సెటిల్ అయ్యారు.

కేరళ కుట్టి ఆమెకు తెలుగు, మళయాలం, తమిళంతో పాటు చాలా భాషలే తెలుసు. 1999లో రాజీవ్ కనకాలను వివాహం చేసుకుంది ఈ అమ్మడు. దాదాపు 30 సంవత్సరాలకు పైగా యాంకరింగ్ చేస్తుంది. మొదట్లో టీవీ సీరియళ్లలో నటించి తర్వాత యాంకరింగ్ వైపునకు మళ్లింది.

సుమలేని ఈవెంట్లు చూడలేం

బుల్లితెరపై, వెండితెరపై పలు షోలు, ఈవెంట్లు ఆమె లేనిదే సాగేవి కాదు. ఎంత పెద్ద స్టార్ నటుడు, నటీమణి అయినా సుమ మాటల ముందు ఇరకాటంలో పడాల్సిందే. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఈవెంట్ చేస్తున్నాడంటే సుమ తప్పనిసరి. వీటితో పాటు ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ సినిమాలో కూడా నటించింది. కొన్ని సీరియల్స్ లలో కూడా ప్రధాన పాత్రలు వేసింది. టాలీవుడ్ లో సుధీర్ఘంగా ఒక షోను నడిపిన ఘనత ఆమెకే దక్కిందని చెప్పాలి. ఈ టీవీలో ప్రసారమయ్యే ‘స్టార్ మహిళ’ అనే షో ను ఆమె దాదాపు 12 నుంచి 15 సంవత్సరాలు నడిపిందంటే ఆమె గొప్పతనం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.

చివరి సినిమాలో ఆకట్టకున్న యాంకర్

షోలు, ఈవెంట్లు, యాంకరింగ్ తో బిజీగా ఉన్న సమయంలోనే ఇటీవల ఒక సినిమాను కూడా చేసింది సుమ. ‘జయమ్మ పంచాయతీ’లో నటించి మెప్పించింది. బుల్లి తెరతో ఇంత అనుబంధం ఏర్పరుచుకున్న ఆమె ఒక నిర్ణయం తీసుకున్నారట. అది విన్న అభిమానులు షాక్ కు గురయ్యారు. అందేంటంటే.. న్యూ ఇయర్ ముందస్తు వేడుకల్లో భాగంగా ఈ టీవీ ఒక ఈవెంట్ ను నిర్వహించింది. ఈ షోలో యాంకర్ సుమను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని విషయాలను ఈవెంట్ వేధికగా పంచుకుంది.

సంచలన విషయాలు చెప్పిన సుమ

ఆమె మాట్లాడుతూ ‘యాంకరింగ్ రాణించడం అంటే మామూలు విషయం కాదు. ఏ పనిలో గుర్తింపు సంపాదించుకోవాలన్నా శ్రమ అవసరమే. ఇప్పటి వరకూ ఆదరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ఇక యాంకరింగ్ కొన్నాళ్లు సెలవు తీసుకోవాలని అనుకుంటున్నా. ఇంత సుధీర్ఘ ప్రయాణంలో విశ్రాంతి కూడా అవసరమే కదా అందుకని ఈ నిర్ణయం తీసుకుంటున్నా’. అంటూ చెప్పింది. దీంతో ఆమె అభిమానులతో పాటు బుల్లితెర ఇండస్ట్రీ కూడా షాక్ కు గురైంది.

సుమ ఇక యాంకరింగ్ కు గుడ్ బై చెప్తుందా..? అంటూ కొందరు భయపడుతున్నా, మరికొంత మంది మాత్రం ఇప్పుడే ఇలాంటి డిషిజన్ తీసుకోవద్దు అంటూ సూచనలు చేస్తున్నారు. ఏది ఏమైనా సుమ తాత్కాలిక విరామం తీసుకుంటుందా.. శాశ్వతంగానా అనేది తేలాల్సి ఉంది.