మొదటి సినిమాకు పవన్ పారితోషికం ఎంతో తెలుసా..

0
646

తమ హీరో గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అభిమాన హీరో జీవితంలోని పండుగలాంటి సందర్భాలను కూడా ఫ్యాన్సే పండుగగా నిర్వహించుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడన్న వార్తను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మా మెగా ఫ్యామిలీ నుంచి సూపర్ న్యూస్ అంటూ షేర్ చేయడం రెండు మూడు రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది. దీంతో పాటు తమ అభిమాన నటుడిని చూస్తూ ఫాలో అవుతుంటారు కూడా.

వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ను సంపాదించుకున్న పవన్

టాలీవుడే కాదు దేశ వ్యాప్తంగా, అంతెందుకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్న స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ మధ్య ఆయన గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారట. ఆయన మొదటి సినిమా పారితోషికం ఎంత. మొదటి సినిమాలో పవన్ ఎలా కనిపించారు. అని గూగుల్ ను తెగ విసిగిస్తున్నారట. ఇప్పుడంటే పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు దాదాపు రూ. 50 కోట్లు పైగా తీసుకుంటున్నారు. కానీ ఆయన కెరీర్ స్టాటింగ్ లో అందునా మొదటి సినిమాలో పారితోషికం ఎంత తీసుకున్నారో ఇక్కడ చూద్దాం.

మొదటి సినిమాకు బీజాలు

చిరంజీవి ఇండస్ర్టీలో మెగాస్టార్ గా ఎదుగుతున్న రోజులవి. తన తమ్ముడిని కూడా ఇండస్ర్టీలోకి తీసుకురావాలని అనుకున్నారట. అయితే అందుకు మంచి డైరెక్టర్ ను వెతకడం మొదలు పెట్టారట. చాలా మంది డైరెక్టర్లతో మాట్లాడి, కథలు కూడా విన్నారట. చివరికి ఈవీవీ సత్యనారాయణను ఫైనల్ చేశారు చిరంజీవి. ఆయన దర్శకత్వం అయితే బాగుంటుందని అనుకొని కథ కోసం వెతుకుతుండగా బాలీవుడ్ లో బాక్సాఫీస్ సాధించిన ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ సినిమాను రీమేక్ చేద్దామని ఫైనల్ చేశారు.

నాగార్జున మేనకోడలు ప్రియాంకను ఫైనల్

పూర్తి రీమేక్ కాకుండా స్క్రిప్ట్ లో కూడా కొన్ని ఛేంజెస్ తీసుకువచ్చారు ఈవీవీ. ఇక ఈవీవీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఫైనల్ అయ్యింది. ఇక హీరోయిన్ ను ఎవరిని తీసుకోవాలని అనే అన్వేషిస్తుండగా అప్పుడే ఇండస్ర్టీ వైపు చూస్తున్న అక్కినేని నాగేశ్వర్ రావు మనుమరాలు, నాగార్జున మేనకోడలు ప్రియాంకను ఫైనల్ చేశారట. ఈ విధంగా మెగా, అక్కినేని ఫ్యామిలీలకు ఈ సినిమా ద్వారా వారధి వేశారు ఈవీవీ.

డిఫరెంట్ గా ప్రమోషన్

డిఫరెంట్ గా ప్రమోషన్ చేసిన ఈవీవీ చిత్రం పూర్తవుతున్న సందర్భంగా ఇండస్ర్టీలో మొదటి సారిగా చాలా డిఫరెంట్ గా ప్రమోషన్ నిర్వహించారు. ముందుగా ఈ అబ్బాయి ఎవరు అని పవన్ కళ్యాణ్ పోస్టర్లను అంటించి ఆడియన్స్ లో ఆసక్తి రేకెత్తించారు. ఇక సినిమా విడుదలకు ముందు ఇతడే పవన్ కళ్యాణ్ అంటూ మరో పోస్టర్లను అంటించారు. దీంతో ఆడియన్స్ లో మరింత ఆసక్తి పెరిగింది.

ఇండస్ర్టీలోని ప్రముఖులంతా

అలా వచ్చిందే ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’. ప్రతీ విషయంలో తమ్ముడిని డిఫరెంట్ గా ప్రజెంట్ చేసేందుకు చిరంజీవి, ఈవీవీ జాగ్రత్తలు తీసుకున్నారట. ఇందులో పవన్ రియల్ ఫీట్స్ చేశాడని మనందరికీ తెలిసిందే కదా.. ఈ సినిమాలో ఒక ఐటం సాంగ్ లో అప్పటి స్టార్ హీరోయిన్ రంభ కూడా కనిపించారు. ఇండస్ర్టీలోని ప్రముఖులంతా ఇందులో నటించారు. ఈ చిత్రం ఆయన కెరీర్ లో యావరేజ్ మూవీ అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

రూ. 5వేలతో మొదలైన జర్నీ

‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’కి దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కాగా, నిర్మాత అల్లు అరవింద్. పవన్ కళ్యాణ్ కు తొలి సినిమా కావడంతో రెమ్యునరేషన్ తక్కువగానే చెల్లించారట. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 50 కోట్లకు పైగా తీసుకునే పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయికి మాత్రం రోజుకు రూ. 5వేలు తీసుకున్నారట. రూ. 5 వేలతో మొదలైన పవన్ కళ్యాణ్ జీవిత ప్రయాణం రూ. 50 కోట్లకు చేరింది. దీని వెనుక ఆయన పడిన కష్టాన్ని కూడా గుర్తించాలి మరి.