బాస్ సాంగ్ చూసి మురిసిపోయిన పవన్ కళ్యాణ్

0
265

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నదమ్ముల అనుబంధం చాలా బాగుంటుంది. ప్రతీ విషయాన్ని ఇద్దరూ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవల మెగాస్టార్ ’ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’కు ఎంపికవగా తమ్ముడు పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్ కు గురయ్యాడంట. అన్నకు అభినందనలు తెలిపాడు. అవార్డులు దక్కించుకోవడంలో చిరు తర్వాతే ఎవరైనా అంటూ ఫ్యాన్స్ కూడా అనుకుంటూ ఉంటారని చెప్పారు.

తమ్ముడి కళ్ళల్లో ఆనందం

బాబీ డైరెక్షన్ లో వస్తున్న ‘వాల్తేర్ వీరయ్య’కు సంబంధించి ఒక సాంగ్ ను బుధవారం (నవంబర్ 23)న చిత్ర యూనిట్ విడుదల చేస్తున్నారు. ఈ సాంగ్ కోసం చిరు అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. ‘బాస్ పార్టీ’ సాంగ్ విడుదలకు ముందు మొదట పవన్ కళ్యాణ్ కు చూపించి తమ్ముడిలో ఆనందం చూశారు చిరు. చిరు సాంగ్ రిలీజ్ తో చిత్ర యూనిట్ లో సందడి మరింత పెరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినీ ప్రేక్షకుల్లో మంచి హైప్ ను క్రియేట్ చేయగా, తాజా బాస్ పార్టీ సాంగ్ ఫ్యాన్స్ ను ఊరిస్తుంది.

చిరంజీవి మాస్ లుక్ లో

చాలా కాలం తర్వాత చిరంజీవి మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. చిరును ఈ లుక్ లో చూసిన అభిమానులు ‘వాల్తేరు వీరయ్య’ కూడా ‘ఘరానా మొగుడు’లా ఉండబోతుందా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంగ్ లో బాస్ లుక్ ఆ స్థాయిలో ఉంది మరి. సాంగ్ ప్రోమోలో లుంగి కట్టుకొని, షర్ట్ మడతపెట్టి, కర్తీఫ్ మెడకు చెట్టుకుని రెడీగా ఉంటూ అంటూ మ్యూజిగ్ డైరెక్టర్ దేవిశ్రీకి సైగ చేస్తాడు చిరంజీవి.

ఏ మూవీ సెట్ అంటూ ప్రశ్నల వర్షం

ఈ సాంగ్ ను సెట్ లో పవన్ కళ్యాణ్ కు చూపించారు చిరంజీవి. అతని ఆనందాన్ని గమనిస్తూ తానూ సంతోషం వ్యక్తం చేసిన ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో ‘హరి హర వీరమల్లు’ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, పక్కనే ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీ ఉన్నారు. ఈ ఫొటో చూసిన వాళ్లంతా ఇది ఏ మూవీ సెట్ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సాంగ్ అదిరిపోయిందని వీళ్ల ముఖాలను చూస్తే అర్థమవుతుంది.

భారీ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూపు

ఈ సాంగ్ బుధవారం సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుందని చిత్ర వర్గాలు పేర్కొనగా అభిమానులు సైతం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల చిరంజీవి తీసిన ‘గాడ్ ఫాదర్’ పూర్తి స్థాయిలో విజయం దక్కించుకోలేకపోవడంతో చిరు ఫ్యాన్ భారీ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. అది ‘వాల్తేరు వీరయ్య’ అవుతుందా.. లేక ‘హరిహర వీరమల్లు’ అవుతుందా అనేది విడుదల తర్వాత తెలుస్తుంది.

అన్నాతమ్ముల అనుబంధం

ఏది ఏమైనా అన్నాతమ్ముల అనుబంధం చూసిన నెటిజన్లు, అభిమానులు మాత్రం మెగా బ్రదర్స్ ను చూసి పొంగిపోతున్నారు. వారు ఎప్పుడూ కలిసే ఉండాలంటూ కామెంట్ల వర్షం కూడా కురిపిస్తున్నారు. వాల్తేరు వీరయ్య గ్రాండ్ సక్సెస్ కు శ్రమిస్తున్న చిత్ర యూనిట్ ను పవన్ కళ్యాణ్ అభినందించారట.