రతన్ టాటా బయోపిక్ కు ఆ టాప్ హీరో నో

0
1380

ఏయిర్ డెక్కర్ ఫౌండర్ గోపీనాథ్ రాసిన పుస్తకం ఆధారంగా యంగ్ ఫీమేల్ డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కిన సినిమా ‘ఆకాశమే నీ హద్దురా’. ఈ సినిమాను హీరో సూర్యనే స్వయంగా నిర్మించారు. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇదే మూవీని బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కించారు. దీంతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు సుధా కొంగర. ఇటీవల ఆమె మరో క్రేజీ కాన్సెప్ట్ ను ఎంచుకున్నారు.

రతన్ పాత్రకు సూర్య

సినీ మీడియా కథనం ప్రకారం డైరెక్టర్ సుధా కొంగర లెజెండరీ వ్యాపార వేత్త రతన్ టాటా బయోపిక్ చేయాలని అనుకుంటుంది. దీని కోసం ఆమె స్క్రిప్ట్ వర్క్ చేయడం కూడా మొదలు పెట్టారంట. రతన్ పాత్రకు సూర్య, లేదంటే అభిషేక్ బచ్చన్ చేస్తారని తెలుస్తోంది. ఈ బయోపిక్ లో నటించేందుకు ఆమె మొదట మహేశ్ బాబును కలిసిందంట. ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో నో చెప్పారని మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇప్పటి వరకూ మహేశ్ ఏ బయోపిక్ లో చేయలేదు. చేయాలని ఉన్నా డేట్స్ అడ్జస్ట్ కాక నో చెప్పారని తెలుస్తోంది.

తమిళంలో ‘ఇరుది సుత్రు’ పేరుతో

సుధా కొంగర 2016 ‘సాలె ఖడూస్’ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. దీన్ని తమిళంలో ‘ఇరుది సుత్రు’ పేరుతో విడుదల చేశారు. ఈ చిత్రానికి గానూ ఆమెకు తమిళంలో ఉత్తమ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 2017లో ‘గురు’ చిత్రంతో ఆమె టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె ‘పావ కథైగల్’ అనే వెబ్ సిరీస్ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు.