‘హిట్-2’ ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసిన నాని

0
1364

అడవి శేషు టాలెంటెడ్ హీరోల లిస్టులో మొదటి వరుసలో ఉంటాడు. ఆయన ఎంపిక చేసుకునే కథలు ప్రతి ఒక్కటీ ఒక ప్రత్యేకమనే చెప్పాలి. కర్మ, క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ ఒక్కో సినిమాకు ఒక ప్రత్యేకత ఉంటుంది. కర్మలో శేషు కర్మ సిద్ధాంతాన్ని నమ్మే మోగిగా కనిపిస్తాడు. క్షణంలో ఫ్రెండ్ కు హెల్ప్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ రోల్ ప్లే చేశాడు. ఇక ఎవరులో తండ్రి హత్య కేసును చాక చక్యంగా పరిష్కరించే కొడుకుగా గూఢచారిలో స్పైగా, మేజర్ లో ఆర్మీ సోల్జర్ గా ఇలా మంచి కథలను ఎంచుకుంటాడు అడవి శేషు.

‘హిట్’తో హిట్టు కొట్టిన దర్శకుడు

ఆయన విలక్షణ నటనను చూసిన న్యాచురల్ స్టార్ నాని ఆయనతో ఓ చిత్రాన్ని తీయబోతున్నారు. క్రైమ్ అండ్ ఆక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ‘హిట్: ది సెకండ్ కేస్’. ‘హిట్’తో హిట్టు కొట్టిన దర్శకుడు శైలేశ్ కొలన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో అడవి శేషు సరసన మీనాక్షి చౌదరి నటిస్తుంది. షూటింగ్ ఇప్పటికే పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దగ్గరపడ్డాయి.

నాని ఈ మూవీకి ప్రొడ్యూస్

హిట్-2 పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. దీనిపై ఇటీవల చిత్ర యూనిట్ ఓ మెలోడీ ట్రాక్ ను కూడా వదిలారు. అవైటెడ్ ట్రైలర్ కూడా విడుదలకు సిద్ధమైంది. రిలీజ్ డేట్ ను నాని, శేషు మీడియా ముందు వివరించారు. బుధవారం (నవంబర్ 23)న ట్రైలర్ లాంచ్ చేస్తున్నట్లు చెప్పారు. నాని ట్రైలర్ ను చూసి చిత్రం హిట్టవడం ఖాయమని కామెంట్లు కూడా చేశాడని చిత్ర యూనిట్ పేర్కొంది. ‘వాల్ పోస్టర్ ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్ లో నాని ఈ మూవీకి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి

ఇప్పటికే ‘మేజర్’తో భారీ సక్సెస్ అందుకున్న శేషు తదుపరి చిత్రంపై ఆయన అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. డిసెంబర్ 2వ తేదీ థియేటర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇందులో బానూ చందర్, రావు రమేశ్, తనికెళ్ల భరణి, కోమలీ ప్రసాద్, పోసాని క్రిష్ణ మురళీ, తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.