జేడీని ఫ్రెండ్ అని నమ్మితే ఆ విషయంలో మోసం చేశాడు

0
200

విజయవాడలో పుట్టి పెరిగిన విజయలక్ష్మి రంభగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో రాజేంద్రప్రసాద్ జోడీగా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ. అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, బాలయ్య బాబులతో కూడా నటించి మెప్పించింది. అనతి కాలంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న రంభ తర్వాతి కాలంలో సరైన సినిమాలు రాని సమయంలో ఐటం సాంగ్స్ కూడా చేసింది. ఇండస్ట్రీతో తన బంధాన్ని ఎప్పుడూ కొనసాగిస్తూ వస్తుంది. బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకున్న తర్వాత ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి సెటిలైపోయింది అమ్మడు.

జేడీ-రంభ కాంబో కలిసి వచ్చింది

రంభ కెరీర్ లో చాలా మంది స్టార్ హీరోలతో చేసినా జేడీ చక్రవర్తితో చేసిన సినిమాలు ప్రత్యేకమనే చెప్పాలి. వీరి పెయిర్ ‘బొంబాయి ప్రియుడు’తో మొదలైంది. తర్వాత కొన్ని చిత్రాల్లో విజవంతంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తిపై షాకింగ్ కామెంట్లు చేసింది. ఆమె చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే విందాం..

జేడీతో నాటి హిట్ పెయిర్ గా నిలిచింది

‘బొంబాయి ప్రియుడు చిత్రం నుంచి జేడీకి నాకు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. చాలా ఫన్నీగా ఉండేవారు జేడీ. ఆయనతో పెయిర్ ఇండస్ట్రీలో మంచి టాక్ తెచ్చుకుంది. వరుసగా కొన్ని సినిమాలు కలిసి చేశాం. ఆయన ఏ విషయాన్ని తిన్నగా చెప్పేవారు కాదు. ఎక్కువగా అబద్దాలు చెప్పేవారు. షూటింగ్ గ్యాప్ లో బయటకు వెళ్లినప్పుడు ఎక్కడున్నావు అని అడిగితే అక్కడా.. ఇక్కడా.. అంటూ అబద్దాలే చెప్పేవారు. నా పెళ్లి సమయంలో ఆయనను ఆహ్వానించా.

కానీ ఆయన మాత్రం రాలేదు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత ఒక సారి ఫోన్ చేసి పెళ్లికి రాలేదని అడిగితే అప్పుడు కూడా ఏదో నసిగినట్లు అనిపించింది. ఇంత మంచి పెయిర్ గా కొనసాగినా, మంచి ఫ్రెండ్ గా మారిన జేడీ అలా చేయడం నిజయంగా బాధనిపించింది.’ అని చెప్పుకచ్చింది.

ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాను

ఇక కెరీర్ పరంగా ఇన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రంభ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుందట. మంచి కథ, అందులో స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇస్తే సినిమాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పుకచ్చింది. ‘ప్రస్తుతం పిల్లలు, భర్తతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాను. కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో వివాహం చేసుకోవడం కొంత బాధ అనిపించినా ప్రస్తుతం మాత్రం ఎటువంటి సమస్యలు లేవు. భర్తతో కలిసి ఆనందంగా ఉన్నా’ అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది రంభ. జేడీపై రంభ కామెంట్లు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.