నాగ్ ప్లేస్ ను మంచుతో రీప్లేస్ చేసిన బిగ్ బాస్..?

0
184

విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న షో ‘బిగ్ బాస్’ బాలీవుడ్ లో మెప్పించి, తర్వాత టాలీవుడ్ కు వచ్చింది. సీజన్లపై సీజన్లపై పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఈ షోకు మొదటి సిరీస్ మొదటి ఎపీసోడ్ నుంచి ప్రేక్షాదరణ ఎక్కువనే చెప్పాలి. స్టార్ మాలో దిగ్విజయంగా రన్ అవుతూ వస్తుంది. ఇప్పటికి ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. రేపో మాపో సీజన్ 7 కూడా మన ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రతీ సీజన్ కొత్తగానే

తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేశారు. తన దైన శైలిలో ఆయన హోస్టింగ్ కంటెస్టెంట్ ఫైటింగ్ ఫస్ట్ సీజన్ ఉత్సుకతతో విజయవంతమైంది. దీంతో టీఆర్పీ కూడా ఆకాశాన్నంటిందనే చెప్పాలి. ఇక తర్వాత సీజన్ 2కు న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఆయన హోస్టింగ్ కూడా డిఫరెంట్ స్టయిల్ లో సాగుతూ మంచి ప్రేక్షకాదరణనే పొందిందని చెప్పాలి. ఆ తర్వాతి సీజన్ (బిగ్ బాస్ 3) నుంచి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించడం ప్రారంభించారు. అప్పటి నుంచి బిగ్ బాస్ సిరీజ్ రేంజ్ మరింత పెరగసాగింది.

సిరీస్ 7 హోస్ట్ ఎవరు..?

వరుసగా నాలుగు సీజన్లకు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఈయన రావడంతో బిగ్ బాస్ కు ప్రేక్షకులు మరింత అడిక్ట్ అయ్యారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో వరుసగా సిరీస్ 5 వరకూ బాగా హైప్ దక్కించుకున్న బిగ్ బాస్ సీజన్ 6 మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రేక్షకుల ఓటింగ్ కు భిన్నమైన ఫలితాలు రావడమే అంటూ కామెంట్లు కూడా వినిపించాయి. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ విషయంలో కూడా రాణించలేదు.

దీంతో ప్రేక్షకులు కొన్ని సందర్భాలలో విసుగుకు కూడా లోనైనట్లు తెలుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే.. సీజన్ 7 నుంచి హోస్ట్ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో నాగ్ కూడా కొందరిని హోస్ట్ గా బిగ్ బాస్ కు కూడా చూపించారని కూడా వైరల్ అయ్యింది.

తెరపైకి ప్రముఖుల పేర్లు

మొదట నాగార్జున హోస్ట్ గా రాణాను సూచించినట్లు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత బిగ్ బాస్ టీం హోస్టింగ్ చేయాలని బాలయ్య బాబును కూడా సంప్రదించారని, ఆయన పెట్టిన శరతులతో టీం వెనక్కు తగ్గినట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. ఇలా సీజన్ 7 హోస్టింగ్ పై వివిధ స్టార్ల పేరు వినిపించాయి.

సిరీస్ 7 హోస్ట్ గా మంచు విష్ణు

ఈ నేపథ్యంలో మరో స్టార్ పేరు కూడా వినిపిస్తోంది. అతడే మంచు విష్ణు. ఇంత మంది స్టార్ల పేరు తర్వాత ఇప్పుడు మంచు పేరు వినిపించడంపై ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ సిరీస్ 7కు మంచు విష్ణు హోస్ట్ గా రాబోతున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మా ప్రెసిడెంట్ గా విజయం సాధించిన విష్ణు ఇటీవల జిన్నా సినిమాలో కనిపించారు. కానీ ఆ సినిమా ఎక్కువగా ఆడలేదు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ గా రాబోతున్నారంటూ వార్తల్లో ఆయన నిలుస్తున్నారు.