మహేశ్ బాబు మాటలకు ఏడ్చేశాను.. అడవి శేషు సంచలన వ్యాఖ్యలు

0
209

మేబర్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న అడివి శేషు తాజాగా ‘హిట్: దిసెంకండ్ కేస్’తో ప్రేక్షకు ముందుకు వచ్చాడు. ‘వాల్ పోస్టర్’ బ్యానర్ పై న్యాచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని నిర్మించాడు. హిట్ సినిమాకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు.

సక్సెస్ సాధించి మంచి ఊపులో

హిట్ 2 లో అడివి శేషు సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే మంచి వసూళ్లను రాబడుతుంది ఈ మూవీ. ప్రస్తుతం అడివి శెషు సక్సెస్ సాధించి మంచి ఊపులో కనిపిస్తున్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియా వేధికగా ఆయనను నెటిజన్లు ఒక ప్రశ్న అడిగారు. అందుకు సమాధానంగా ఆయన మహేశ్ బాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అడివి శేషు రిప్లై కూడా

సదరు సోషల్ మీడియా ఖాతా దారుడు.. ‘హిట్ వంటి యూనిర్స్ లోకి మహేశ్ బాబును హీరోగా తీసుకువాలని అన్న.. ఇక హిట్ నెక్స్ట్ లెవల్ కి వెళ్లిపోద్ది.. ఇందులోని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీకి మహేశ్ బాబును పెట్టాలి అని అభిమాని ట్వీట్ చేశారు.’ అందుకు అడివి శేషు రిప్లై కూడా చేశాడు. ‘ఈ రోజు (హిట్ విడుదలైన రోజు) ఉదయమే మహేశ్ బాబుతో మాట్లాడాను. హిట్ సినిమా ఆయనతో కలిసి చూడాలని అనుకున్నానని చెప్పాను. ఆయన కూడా ఒకే చెప్పారు. ఒక సోదరుడిగా ఎప్పుడూ నీ పక్కన ఉంటానని ఆయన నాతో అన్నారు.

ఎంత గర్వంగా ఉంటుందో కదా

నీకు ఎప్పుడూ నేను తోడుంటానని, శేషు నిన్ను చూస్తే గర్వంగా ఉందని’ ఆయన అన్న మాటలకు నాకు ఏడుపచ్చింది. అంతటి స్టార్ నన్ను, నా సినిమాలకు గమనిస్తున్నారంటే ఎంత గర్వంగా ఉంటుందో కదా.. ఆ మాటలు విన్ననాకు కన్నీళ్లు ఆగలేదు.’ అని ట్వీట్ చేశాడు. ఈ కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

హిట్ ను నాని ఒక ఫ్రాంచైజీ కింద రిజిస్ర్టర్

ఇక న్యాచురల్ స్టార్ నాని సొంత బ్యానర్ ‘వాల్ పోస్టర్ మూవీస్’ పై వచ్చిన హిట్ 2 సంచలనంగా దూసుకుపోతోంది. హిట్ ను నాని ఒక ఫ్రాంచైజీ కింద రిజిస్ర్టర్ చేయించారు. ఇక హిట్ సస్పెన్స్, డిటెక్టివ్ మోడ్ లో ప్రతి సంవత్సరం ఒక మూవీని చేస్తామని నాని చెప్పాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రాజమౌళి పాల్గొని చిత్ర యూనిట్ ను అభినందించడం కొనసమెరుపు.