మసూద VS గాలోడు.. కలెక్షన్లు చూస్తే షాక్ అవుతారు..!

0
341

ఓ వైపు పాన్ ఇండియా మూవీ ‘యశోద’ థియేటర్లలో బిజీగా ఉండగా, ఈ వారం పెద్ద సినిమాలు ఏవీ విడుదల కాలేదు. గత శుక్రవారం రెండు చిన్న మూవీలు ప్రధానంగా థియేటర్లలోకి వచ్చాయి. బడ్జెట్ ఎంతైనా కంటెంట్ ఉంటే చాలు అనే తెలుగు ప్రేక్షకులను ఇవి కూడా బాగానే అలరించాయి. అందులో ఒకటి ‘మసూద’ అయితే రెండోది ‘గాలోడు’ బడ్జెట్ పరంగా చిన్న సినిమాలే అయినా క్యూరియాసిటీ కంటెంట్ తో సినీ అభిమానులను కట్టిపడేసాయి. పెద్దగా గుర్తింపు లేని సినిమాలే అయినా ఓపినింగ్స్ ను బాగానే ఉన్నాయి.

ఆంధ్రాలో చాలా డల్ గా

‘మసూద’ ట్రైలర్ నుంచే మంచి క్యూరియాసిటీని గ్రాబ్ చేసుకుంటూ వస్తుంది. ఒక అమ్మాయికి దయ్యం పడుతుంది. వదిలించేందుకు రక్త సంబంధీకుల రక్తం కావాలని పీర్ బాబా చెప్తాడు. ఇంతకీ ఇందులో మసూద ఎవరూ హర్రర్ థ్రిల్లర్ గా మూవీ సాగిపోతుంది. కామెడీని జోడించకుండా కొంచెం వరకు పెట్టిన లవ్ ట్రాక్ ను కూడా సాగదీయంగా మంచి అటెన్షన్ క్రియేట్ చేస్తూ తెరకెక్కించాడు డైరెక్టర్ రాహుల్ యాదవ్ నక్కా. కంటెంట్ కొంచెం పాతదైనా న్యూవేలో సాగిపోతోంది ఈ మూవీ. కానీ ఈ మూవీ అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. హైదరాబాద్ లో కొంత మేర వసూళ్లు బాగానే ఉన్నా.. ఆంధ్రాలో చాలా డల్ గా కనిపించింది. రూ. 1.43 కోట్లు మాత్రమే మూడు రోజుల్లో కలెక్ట్ చేసింది.

మూడు రోజుల్లో రూ. 2 కోట్ల వరకు

‘గాలోడు’ కూడా గత శుక్రవారమే రిలీజైంది. ఇందులో సుడిగాలి సుధీర్ హీరో రోల్ ప్లే చేశాడు. అతనికి బుల్లి తెర నుంచి ఉన్న క్రేజ్ తో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. మూడు రోజుల్లో రూ. 2 కోట్ల వరకు కలెక్ట్ చేసింది ఈ మూవీ. సుధీర్ కు ఉన్న ఫ్యాన్స్ ఈ మూవీని కొంతమేర నిలబెట్టారని చెప్పచ్చు. సిల్వర్ స్ర్కీన్ పై తనని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న సమయంలో వచ్చిన అవకాశమే ‘గాలోడు’ అంతుకు ముందు ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ డైరెక్టరే దీనికీ దర్శకత్వం వహించాడు. గాలోడిని సుధీర్ అంతా ముందుండి నడిపించాడు. కామెడీ, రొమాన్స్, యాక్షన్ అన్నింట్లో మెప్పించాడనే చెప్పచ్చు. సుధీర్ ఫ్యాన్స్ కు ఇది ఫుల్ మీలే అనిపిస్తుంది.