పెళ్లికి ముందు అలా చేయండి.. లవర్స్ కు పూరి సలహా..

0
390

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ పొజిషన్ ఇండస్ర్టీలో చాలా వరస్ట్ అనే చెప్పాలి. రీసెంట్ గా రిలీజైన ‘లైగర్’ భారీ డిజాస్టర్ కావడంతో ఆయన బాగా కుంగిపోయారు. దీనికి తోడు ఆ మూవీకి ఫండింగ్ విషయంలో ఈడీ నుంచి అనేక ప్రశ్నలను ఎదుర్కొన్నారు కూడా. ఇక డిస్ర్టిబ్యూటర్ల నుంచి బెదిరింపు కాల్స్ ఇలా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు పూరీ జగన్నాథ్.

దీనికి తోడు ఆయన ఛార్మిని కూడా ప్రొడక్షన్ రంగంలోకి దింపడంతో ఇది మరో వివాదానికి దారి తీసింది. మొత్తంగా పూరీ చాలా వరస్ట్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ఇప్పుడు ఆయన చేతిలో ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. ఒకప్పుడు ఇండస్ర్టీని షేక్ చేసిన టాప్ డైరెక్టర్ కంటెంట్ ఇప్పుడు సినీ అభిమానులకు నచ్చకపోవడమే అని తెలుస్తోంది.

పూరీ ఉచిత సలహాపై నెటిజన్ల ఫైర్

‘లైగర్’ తర్వాత పూరి మరింత పాతాళానికి పడిపోయారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఆయన యూత్ కు ఓ బూతు మెసేజ్ పాస్ చేశాడు. ‘అమ్మాయి, అబ్బాయి నిజమైన లవ్ లో ఉన్నారా అని తెలుసుకునేందుకు ఇలా చేయండి’ అంటూ బూతు సలహా ఒకటి ఇచ్చాడు. ‘సాధారణంగా ప్రేమలో ఉన్న వారు నువ్వులేకుండా నేను లేను అన్న మాటలు వినిపిస్తూనే ఉంటాయి. అది నిజమైన లవ్ అయితే పెళ్లికి ముందు రెండు సార్లు మిమ్మల్ని మీరు సంతృప్తి పరుచుకోండి. తర్వాత కూడా ఒకరిపై ఒకరికి మళ్లీ మళ్లీ అదే విధమైన ఫీలింగ్ కావాలని అనిపిస్తేనే పెళ్లి చేసుకోండి.

అదే నిజమైన లవ్.. అందులో ఎటువంటి అట్రాక్షన్ లేదని తెలిసిపోతుంది’ అని చెప్పాడు. పూరీ చేసిన ఈ మ్యూజింగ్స్ ను ప్రస్తుతం యూత్ బాగా ట్రోల్ చేస్తుంది. ఇంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయిన పూరీ సమాజం పట్ల గౌరవం లేకుండా ఇలాంటి సలహా ఇస్తాడా..? అంటూ నెటిజన్లు మండిపడున్నారు. జగన్నాథ్ లవర్స్ కు ఇచ్చిన సలహా ప్రస్తుతం వైరల్ గా మారింది. విపరీతమైన నెగెటివ్ కామెంట్లతో పూరి మరోసారి వార్తల్లో నిలిచాడనే చెప్పాలి.

చిరంజీవితో సినిమాకు ప్లాన్

ఇక పూరీ జగన్నాథ్ కెరీర్ విషయానికి వస్తే ఆయనకు అస్సలు కాలం కలిసి రావడం లేదు. కానీ ఆయన మాత్రం బాల్ బౌన్స్ పద్ధతిని బాగా నమ్ముతారు. బాల్ ను ఎంత బలంగా గోడకు కొడితే అది అంతే బలంగా వెనుకకు వస్తుంది. తాను పాతాళానికి పడిపోయానని ఇండస్ర్టీ చెప్పుకుంటుంది. కానీ నేను అంతే భారీ హిట్ తో మళ్లీ వస్తానంటున్నాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో ఒక చిత్రంపై తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారట పూరీ జగన్నాథ్.

ఇప్పటి వరకూ చిరంజీవితో ఆయన ఒక్క సినిమా కూడా చేయలేదు. కలిసి మాత్రం ‘గాడ్ ఫాదర్’లో నటించారు. కొన్ని రోజుల కింద పూరీ చెప్పిన కథకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇదే కనుక నిజమైతే భారీ బాక్సాఫీస్ హిట్ కోసం పూరీతో పాటు ఇండస్ర్టీ కూడా వెయిట్ చేయకతప్పదు.