సీక్రెట్ గా మూడో పెళ్లి చేసుకున్న జయసుధ..!

0
1183

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ మొదలుకొని ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు ఇలా చాలా మంది స్టార్లతో నటించి మెప్పించారు జయసుధ. ఆమెకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఒక్కో సారి ఆమె ఉంటేనే సినిమా కూడా బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. హీరోయిన్ గానే కాకుండా సెకండ్ హీరోయిన్ గా కూడా నటించి మెప్పించారు జయసుధ.

ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్ ను వివాహం చేసుకున్నారు జయసుధ. తర్వాత కొన్ని రోజులకు వారి మధ్య ఏర్పడిన మనస్పర్థలతో విడిపోయారు. విడాకులు తీసుకొని కొంత కాలం ఒంటరిగా జీవించారు ఆమె. బాలీవుడ్ హీరో జితేంద్ర కపూర్ కజిన్ అయిన నితిన్ కపూర్ ను తర్వాత పెళ్లి చేసుకుంది.

నితిన్ మరణంతో ఒంటరిగా మిగిలిన జయసుధ

వీరి దాంపత్యం బాగానే కొనసాగింది. అన్యూన్యంగా చాలా కాలం పాటు జీవించారు జయసుధ-నితిన్ కపూర్. వీరికి ఒక బాబు కూడా పుట్టాడు. తర్వాత కొన్ని కారణాల వల్ల 2017లో నితిన్ కపూర్ మరణించారు. అయితే నితిన్ కపూర్ ది సహజ మరణం కాదని ఏవో కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఆయన మరణంతో చాలా రోజుల నుంచి ఒంటరిగానే గడుపుతుంది జయసుధ.

దీని నుంచి బయటపడేందుకు సినిమాలే మార్గమని ఎంచుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తల్లి, అత్త, అమ్మమ్మ, నానమ్మ లాంటి పాత్రలు చేస్తూ మళ్లీ బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది జయసుధ. ఇటీవల ఆమె అనారోగ్యం పాలవడంతో ట్రీట్మెంట్ కోసం యూఎస్ వెళ్లింది. ఆ సమయంలో గుర్తు పట్టలేనంతగా మారిపోయింది.

అన్ స్టాపబుల్ లో విషయాలు పంచుకున్న జయసుధ

ఇటీవల బాలకృష్ణతో అన్ స్టాపబుల్ ఎన్ బీకే 2లో జయప్రదతో కనిపించింది జయసుధ. బాలకృష్ణతో తనకున్న స్నేహం, తన భర్తకు బాలకృష్ణకు మధ్య ఉన్న స్నేహాన్ని వివరించే ప్రయత్నం చేసింది. తన భర్త మరణం కుటుంబ సభ్యుల తర్వాత బాలకృష్ణకు మాత్రమే తెలుసని అప్పుడు బాల(బాలకృష్ణ)తో ఓ షూటింగ్ లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని వివరించింది. ఈ విషయాలను పక్కన పెడితే..

జయసుధతో ఆ వ్యక్తి

కొన్ని రోజులుగా జయసుధ ఒక వ్యక్తిని మూడో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం లేదని ఆమె కొట్టి పారేస్తున్నా.. పదే పదే.. అదే వ్యక్తితో ఆమె కనిపిస్తుండడంతో పెళ్లి చేసుకుందని వార్తలకు ప్రాణం పోస్తోందనిపస్తుందని నెటిజన్ల నుంచి వినిపిస్తుంది. ఇటీవల విడుదలైన వారీసు (వారసుడు) సినిమాలో జయసుధ విజయ్ తల్లిగా నటించిన విషయం అందరికీ తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్ లో ఆమె ఒక వ్యక్తితో వచ్చింది. ఇదే కాకుండా గతంలో అలీ ఇంట్లో జరిగిన పెద్ద కూతురు వివాహానికి వచ్చిన జయసుధతో పాటు సదరు వ్యక్తి కనిపించాడు. ఎక్కడైనా జయసుధ వెంట ఆ వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆయన కూడా ఒక బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది. ఈ విషయంపై జయసుధ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.