బెల్డ్ తో కొట్టుకుంటూ బెదిరించిన శ్రీహాన్

0
2624

బిగ్ బాస్ తో గుర్తింపు దక్కించుకున్నాడు శ్రీహాన్. బేసిక్ గా విన్నర్ స్థానంలో నిలవాల్సిన శ్రీహాన డబ్బులు అవసరం మేరకు రూ. 40 లక్షలు తీసుకొని రన్నర్ గా మిగిలిపోయాడు. ఇక బిగ్ బాస్ జోడీ గురించి మాట్లాడుకుంటే శ్రీహాన్ తో ఎక్కువగా కనిపించేది సిరి హన్మంత్. బిగ్ బాస్ గత సీజన్ లో కంటెస్టెంట్ గా సిరి ఉంటే శ్రీహాన్ బయటి నుంచి ఆమెకు సపోర్ట్ చేశాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 6 వచ్చేప్పటి వరకూ కంటెస్టెంట్ గా శ్రీహాన్ ఉంటే సిరి బయటి నుంచి ఆయనకు సపోర్ట్ చేసింది.

ఈ నేపథ్యంలో ఫ్యామిలీ వీక్ లో శ్రీహాన్ ను కలిసేందుకు సిరి శ్రీహాన్ అన్న కొడుకుతో హౌజ్ లోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో జరిగిన సన్నివేశాలు ఇద్దరికీ బ్యాడ్ నేమ్ తెచ్చిపెట్టాయి. శ్రీసత్యకు వార్నింగ్, శ్రీహాన్ కు దూరంగా ఉండాలని చెప్పడం. శ్రీహాన్ గెలుపు గురించి తదితరాలు బిగ్ బాస్ ప్రేక్షకులకు కూడా కొంచెం జుగుబ్సా కలిగించాయనే చెప్పాలి.

వైరల్ అవుతున్న వీడియో

సిరి-శ్రీహాన్ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వీరిద్దరూ ఒక అబ్బాయిని పెంచుకుంటున్నారు. తాజాగా శ్రీహాన్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. వారు పెంచుకుంటున్న అబ్బాయి పేరు చైతు. మాట వినకుండా అల్లరి చేస్తుండడంతో బాబును బెదిరించేందుకు శ్రీహాన్ బెల్ట్ తో తనను తాను కొట్టుకున్నట్లు నటించాడు.

‘ఎన్ని సార్లు చెప్పాలి నీకు.. నా మాట వింటావా..? వినవా..?’ అంటూ అడిగాడు. కొట్టుకోవద్దు డాడీ నీ మాట వింటాను అంటూ బాబు కూడా ఏడవడం ప్రారంభించాడు. ఈ సీన్ ను శ్రీహాన్ గర్ల్ ఫ్రెండ్ సిరి వీడియోలో చిత్రీకరించింది. దీన్ని ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది. ఇప్పుడు ఇది తెగ వైరల్ అవుతుంది.

తీవ్రంగా స్పందించిన చిన్మయి

ఈ వీడియోపై సింగర్ చిన్మయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్లలను వారించేందుకు ఇలాంటి పనుల చేయద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మనకు మనం హానీ చేసుకున్నా అది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పింది. తల్లిదండ్రులు చిన్నతనంలో పిల్లలను వారించేందుకు ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారని కానీ ఇది మంచిది కాదని చెప్పుకచ్చింది.

ఇలాంటి వాటితో అనుకున్న పనులు చేయించుకోవచ్చని వారికి ఒక సమాచారం వెళ్తుంది. దీంతో లైఫ్ లో ఎదుగుతున్నా కొద్ది వారు కూడా కొట్టుకుంటాం.. ఆత్మహత్య చేసుకుంటాం లాంటి మాటలు వాడుతూ ఎదుటివారిని బెదిరిస్తారని చెప్పింది చిన్మయి. ఈ ధోరణికి ఈ జనరేషన్ లో అయినా ముగింపు పలకాల్సిన బాధ్యత మనపై ఉంది. అంటూ పోస్ట్ పెట్టింది.

చిన్మయిపై నెటిజన్ల ఫైర్

చిన్మయి పోస్ట్ పై నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. వారేదో సరదాగా తీసిన వీడియోపై ఇంతటి స్పందన అవసరం లేదంటూ చిన్మయిపై మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం చిన్మయి చెప్పినదాంట్లో ఎలాంటి తప్పు లేదు. పిల్లల మనసుపై ఇలాంటివి ప్రభావం చూపుతాయి. ఈ విషయాలను సైకియార్టిస్టులు కూడా చెప్తున్నారు. ఇలా కాకుండా సరైన పద్ధతిలో చెప్తే మంచిదని సూచిస్తున్నారు.