ఏ రంగు దుస్తులు వేసుకుంటే మంచిదో తెలుసా..?

0
819

ఒక్కో రంగులో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. తెలుపు స్వచ్ఛత, శాంతిని కోరుకుంటే, తొగరు రంగు పొగరును సూచిస్తుంది. ఇలా ప్రతీ రంగుకు ఓ గుర్తింపు ఉంది. ఆ రంగు దుస్తులు ఇష్టపడే వారి వ్యక్తిత్వాన్ని కొందరు అంచనా వేస్తుంటారు. రోజుకో రంగు బట్టలు ధరించే వాళ్లు కూడా ఉంటారు. అవి చేసే హంగుల గురించి తెలుసుకుందాం.

నీలిరంగు

అంతులోని ఆకాశం రంగు నీలం. లోతు తెలియని సముద్రం రంగు కూడా నీలం. ఈ దస్తులను ధరించిన వారికి ఆత్మవిశ్వాసం రెట్టింపుగా అవుతుంది. దీంతో పాటు నీలిరంగు హుందా తనం, స్థిరత్వానికి ప్రతీకగా కూడా చెప్పవచ్చు.

తెలుపు

ఈ రంగు దుస్తులు ప్రశాంతంగా ఉంచేందుకు తోడ్పడుతాయి. తెలుపు శాంతికి చిహ్నం. జీవితంలో ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టే సమయంలో ఈ దుస్తులను వేసుకుంటే ఆత్మవిశ్వాసం పెరిగి పనులు మరింత నిష్టతో చేస్తాం. ఆందోళనలు కూడా దూరం అవుతాయి.

ఆకుపచ్చ

ఈ రంగును ప్రకృతి చిహ్నంగా భావిస్తాం. దీంతో పాటు అదృష్టం, సంరక్షణకు చిహ్నంగా కూడా చూస్తాం. ఈ దుస్తులను ధరిస్తే సకల విజమాలు కలుగుతాయని విశ్వాసం. దీంతో పాటు చేసే పనిలో పరిపూర్ణంగా నిమగ్నమవుతారు. ఈ రంగు బోలెడన్నీ పాజిటివ్ ఎనర్జీస్ తీసుకస్తుంది. కొత్త వ్యక్తులను కలిసిన సమయంలో ఈ రంగు దుస్తులు వేసుకుంటే వారికి మనపై బెస్ట్ ఇంప్రెషన్ పడుతుంది.

నారింజ

నారింజ (ఆరంజ్) రంగు దుస్తులను ధరిస్తే మనసుకు సంతోషం కలుగుతుంది. 10 మందిలో కలిసిపోయే స్వభావం ఉన్నవాళ్లు ఈ రంగు దుస్తులను ఎక్కువగా ఇష్ట పడుతుంటారు. తెలియని వాళ్ల మధ్య ఉన్నప్పుడు మనం ఉల్లాసం, ఉత్సాహంగా ఉండేందుకు ఆ ప్రదేశాలను కూడా అలాగే తీర్చిదిద్దేందుకు నారింజ దోహదపడుతుంది.

గులాబీ

గులాబీ రంగు జాలి, కరుణ, మృధుస్వభావానికి సూచికగా చూడవచ్చు. ఈ లక్షణాలతో పాటు దృఢత్వానికి ప్రతీక కూడా. ఫ్రెష్ గా ఉండేందుకు సైతం సూచిస్తుంది. ఆత్మీయ వేడుకలకు ఈ రంగు దుస్తులు బాగా నప్పుతాయి. గత తాలూకు గుర్తులు కనిపించనీయదు. నాయకత్వ లక్షణానికి కూడా ప్రతీకగా దీన్ని భావిస్తారు.

పసుపు

ఈ రంగు దుస్తులు వేసుకున్న వారు ఆ రోజు మొత్తం పాజిటివ్ ఎనర్జీతో పని చేస్తారు. అందుకే ప్రత్యేక సందర్భాల్లో పసుపు దుస్తులు ఎంచుకుంటే మంచిది. ఈ రంగు దుస్తులు ధరించిన వారికి ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి.

ఎరుపు

ఎరుపు రంగు చీర కట్టుకున్నా.. డ్రెస్ వేసుకున్నా వంద మందిలో కూడా వారు ప్రత్యేకంగా కనిపిస్తారు. ఎక్కడి వారినైనా ఇట్టే ఆకర్షిస్తారు. అందుకే ఈ రంగు ఆత్మ విశ్వాసం పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ దుస్తులు వాడేవారు కోపం, తెగువ, ప్రేమ భిన్న స్వభావాలకు ప్రతీకగా చెప్పుకోవచ్చు.

నలుపు

సాధారణంగా నలుపును అశుభానికి ప్రతీకగా భావిస్తారు. కానీ దుస్తులు, ఫ్యాషన్ ప్రపంచంలో దాని స్థానం ఎప్పుడూ మొదటి వరుసే. నలుపు మనిషిలోని ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. దీన్ని నిరసనకు గుర్తుగా కూడా భావిస్తారు. నలుగురితో కలిసి పని చేసేప్పుడు నలుపు రంగు దుస్తులు వాడితే పని ప్రదేశం చాలా ఎగ్జైట్ గా మారుతుందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి.