మరింత దిగజారిన సమంత ఆరోగ్యం.. ట్రీట్‌మెంట్ కోసం ఆ దేశానికి

0
537

స్టార్ హీరోయిన్ సమంత కొంత కాలంగా ‘వయోసైటిస్’తో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్య ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం ఆమెను దక్షిణ కొరియాకు తీసుకెళ్తున్నారని సమాచారం.

అరుదైన వ్యాధి వయోసైటిస్

వయోసైటిస్ కండరాలను నిర్వీర్యం చేసి చివరికి పేషంట్ ను మంచానికే పరిమితం చేస్తుంది. ఇది చావు వరకు కూడా తీసుకెళ్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. తనకు వయో సైటిస్ ఉందని ఆమె సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించారు కూడా. దీంతో ఇటీవల ఆమె ఆరోగ్య పరిస్థితిపై రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అలాంటిది ఏమీ లేదని సమంత బాగానే ఉన్నారని ఆమె ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. దీంతో ఆమె ఆరోగ్యంపై వచ్చినవన్నీ రూమర్సే అని తెలిపారు.

దక్షిణ కొరియాకు సమంత

ఈ వ్యాధికి చికిత్సం కోసం ఆమె గతంలో అమెరికా వెళ్లారు. అదే చికిత్సను ఇండియాలో ఉంటూనే కొనసాగిస్తూ వస్తున్నారు. దీంతో పాటు ఆమె ఇటీవల సంప్రదాయమైన వైద్యం కోసం కేరళకు కూడా వెళ్లిందని సమాచారం. అక్కడ ఆయుర్వేద చికిత్స తీసుకుంటుందని తెలిసింది. తాజాగా సమంత ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెను దక్షిణ కొరియాకు తరలించినట్లు చెప్తున్నారు. అక్కడ వయోసైటిస్ కు మంచి చికిత్స ఉందని అందుకే తీసుకెళ్లినట్లు సమాచారం.

అక్కడ మెరుగైన వైద్యం

వయోసైటిస్ కు యూఎస్ లో సరైన చికిత్స లేదని కానీ దక్షిణ కొరియాలో మాత్రం ఆధునిక, సంప్రదాయ చికిత్స లు ఉన్నాయట. ఈ విషయం ఆమెకు తెలియడంతో వెంటనే సమంత వెళ్లినట్లు సమాచారం. సామ్ చికిత్స కోసం సౌత్ కొరియా వెళ్లిందన్న వార్తలపై ఇప్పటి వరకూ ఆమె నుంచి గానీ, వైద్యుల నుంచి గానీ, కుటుంబం నుంచి గానీ ఎలాంటి క్లారిటీ రాలేదు. అభిమానులు మాత్రం ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారట.

అదే కారణమా

నాగ చైతన్యతో డైవర్స్ తీసుకున్న తర్వాత సమంత బాగా కుంగిపోయారట. డీప్రెషన్ నుంచి బయటపడేందుకు జిమ్ లో విపరీతమైన ఎక్సర్ సైజులు చేసిందట. కండరాల మీద బాగా వెయిట్ పడింది. ఈ క్రమంలోనే సమంతకు ‘వయో సైటిస్’ వ్యాధి సోకిందని సమాచారం.