‘పోటుగాడిలా’ అంటూ లేడీ కంటెస్టెంట్ వార్నింగ్

0
263

బిగ్ బాస్-6 13వ వారానికి చేరుకుంది. ఇందులో రేవంత్ నిజ స్వరూపాన్ని బయటపెట్టింది ఫైమా. పోటుగాడిలా మాట్లాడకు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో నామినేషన్ల పర్వంలో చలికాంలో కూడా ఒక్క సారిగా వేడి పుట్టింది.

గత వారం రాజ్ ఎలిమినేట్

ఇంకో మూడు వారాల్లో షో ముగియబోతోంది. గత ఆదివారం రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత ఎలిమినేషన్లు రసవత్తరంగా ఉండబోతాయని తెలుస్తోంది. నామినేట్ విషయంలో ఒకరిపై మరొకరు ఫైర్ అవుతూ హీట్ పెంచారు. రేవంత్, ఫైమా దాదాపు దాడి చేసుకునేంత వరకూ వెళ్లడంతో కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా షాక్ కు గురయ్యారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతోనే హౌజ్ మేట్స్ ఒకరిపై ఒకరు నామినేట్ చేసుకున్నారు.

రేవంత్ రెచ్చిపోకు

ఆదిరెడ్డి రేవంత్ ను నాటిమనేట్ చేస్తూ.. శనివారం చేసిన మానిప్యులేటర్ అనే కాంమెంట్లతోనే తాను రేవంత్ ను నామినేట్ చేస్తున్నట్లు ఆదిరెడ్డి తెలిపాడు. దీనిలో భాగంగా జరిగిన చర్చ హీట్ ను పెంచింది. రేవంత్ రెచ్చిపోకు.. నువ్వు పెద్ద పోడుగాలిలా మాట్లాడకు అంటూ ఆదిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం, రేవంత్ కూడా అతే తరహాలో తిప్పికొట్టడంతో హౌజ్ లో అగ్గి రాజుకుంది.

ఫైమా.. రోహిత్, రేవంత్ ను నామినేట్ చేసింది

ఇక ఫైమా రోహిత్, రేవంత్ ను నామినేట్ చేసింది. రోహిత్ ని తన కంటే కూడా స్ర్టాంగ్ అని నామినేట్ చేసిది ఫైమా. సరైన స్టాండ్ తీసుకోవడం లేదని శ్రీహాన్ రోహిత్ ను నామినేట్ చేయగా, ఇక అమ్మాయిలతో టాస్క్ ఆడి గెలవండి అని అంటూ కామెంట్ చేసినందుకే రోహిత్ ను నామినేట్ చేసినట్లు శ్రీహాన్ వెల్లడించాడు. కీర్తి శ్రీసత్య, రేవంత్ ను నామినేట్ చేసింది. ఏదైనా విషయం ఉంటే స్ర్టైట్ గా కాకుండా వెనకాల మాట్లాడుతున్నారని నామినేట్ చేస్తున్నట్లు తెలిపింది. శ్రీసత్య తనలో వెటకారం బాగా ఉందని తగ్గించుకోవాలని సూచించింది. ఇక శ్రీసత్య ఆదిరెడ్డి, కీర్తిని నామినేట్ చేసింది. రోహిత్.. ఫైమా, ఆదిరెడ్డిని నామినేట్ చేశాడు.

రేవంత్ ఫైమా, ఆదిరెడ్డిని నామినేట్ చేసింది

రేవంత్.. ఫైమా, ఆదిరెడ్డిలను నామినేట్ చేశాడు. ఆదిరెడ్డి చేయని పని చేశాడని గాసిప్ లు క్రియేట్ చేస్తుంటాడని నామినేట్ చేస్తున్నట్లు రేవంత్ చెప్పాడు. దీనిపై రేవంత్, ఆదిరెడ్డి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఫైమా కూడా రేవంత్ పై కామెంట్ చేసింది. ముందొకలా, వెనకొకలా మాట్లాడే స్వభావం రేవంత్ ది అని చెప్పింది. ఇన్ని రోజులూ హౌజ్ లో ఇదే కొనసాగుతుందని, కానీ ఎవరూ గుర్తించలేకపోయారని చెప్పుకచ్చింది ఫైమా. ఈ విషయంలో రేవంత్, ఫైమా దాడికి దిగే వరకూ వెళ్లారు. ఇక హౌజ్ కేప్టెన్ ఇనయా సుల్తానా రేవంత్, శ్రీసత్యను నామినేట్ చేసింది.

హౌజ్ మేట్స్ కు క్లాస్

ఇక 13వ వారంలో కేప్టెన్ ఇనయా సుల్తానా, శ్రీహాన్ నామినేషన్ కు దూరం కాగా, ఆదిరెడ్డి, రేవంత్, ఫైమా, కీర్తి, రోహిత్, శ్రీసత్య నామినేట్ అయ్యారు. ఇదిలా ఉంటే గత వారం ఫుడ్ వేశారని బిగ్ బాస్ హౌజ్ మేట్స్ కు క్లాస్ పీకారు. ఇందులో భాగంగానే బిగ్ బాస్ ఈ వారం లగ్జరీ బడ్జెట్ ను కట్ చేశారు.