మహేశ్ తో ప్రాజెక్టుపై రాజమౌళి క్లారిటీ.. ఆ ఇంగ్లీష్ ఫిల్మ్ లా ఉంటుంది

0
247

జక్కన్నగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ రాజమౌళి మహేశ్ బాబుతో తన తదుపరి చిత్రంపై క్లారిటీ ఇచ్చారు. వీరి కాంబోలో పాన్ ఇండియా రేంజ్ లో ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందని గతంలోనే వార్తలు వచ్చాయి. దీనిపై రాజమౌళి మరిన్ని వివరాలు చెప్పాడు. ఈ ప్రాజెక్టుపై మహేశ్ బాబు ఫ్యాన్స్ కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు. మూవీ ఎలా ఉండబోతోంది..! కథ ఏంటి..? పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందా..? అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై రాజమౌళి స్పందించారు.

హాలీవుడ్ లో ఆనవాయితీగా

హాలీవుడ్ గవర్నర్స్ అవార్డుల ప్రదానోత్సవంలో రాజమౌళి కార్తికేయతో కలిసి పాల్గొన్నారు. లాస్ ఏంజలీస్ లో జరిగిన ఈ వేడుకల్లో వీరిద్దరూ సందడి చేశారు. ఆస్కార్ అవార్డుల కంటే మందు గవర్నర్స్ అవార్డులు ప్రదానం చేయడం హాలీవుడ్ లో ఆనవాయితీగా కొనసాగుతుంది.

ఇండియా జోన్స్ తరహాలో

‘నేను దర్శకత్వం వహించిన చిత్రాల్లోని చాలా వరకూ కథను మా నాన్న విజయేంద్ర ప్రసాద్ అందించినవే. ఇటీవల నేను సొంతంగా ఒక రాసుకున్నాను. దాని డెవలప్ మెంట్ కోసం నాన్నతో చర్చిస్తున్నా. ఇదొక అడ్వెంచర్ స్టోరీ, ఇలాంటి జోనర్ లో పని చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నా సరైన స్టోరీ లేక వేయిట్ చేయాల్సి వచ్చింది. ఇంగ్లీష్ ఫిల్మ్ ‘ఇండియా జోన్స్’ నా వన్ ఆఫద ఫెవరేట్ మూవీ ఇదే తరహాలో కొత్త కథను డెవలప్ చేసుకొని మహేశ్ బాబుతో ఈ మూవీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా’ అన్నాడు టాలీవుడ్ జక్కన్న.