అలీకి పవన్ కళ్యాన్ కు మధ్య వివాదం

0
2225

నాలుగు దశాబ్దాల పాటు ఇండస్ర్టీలో కొనసాగుతున్న నటుడు అలీ. బాల నటుడిగా వెండితెరకు పరిచయం అయిన అలీ అనేక వైవిధ్యభరితమైన రోల్స్ లో నటించాడు. బాలనటుడిగా ఆయన ‘సీతాకోక చిలుక’తో హీరో మురళితో కలిసి నటించి మెప్పటించాడు అలీ. ఆ చిత్రానికి ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత వచ్చిన ఆఫర్లను బట్టి కమేడియన్ గా రాణించాడు. కొన్ని సినిమాల్లో హీరోగా కూడా చేశాడు. అలీ హీరోగా చేసిన చిత్రాల్లో ప్రధానంగా చెప్పుకోదగింది ‘యమలీల’ ఈ చిత్రానికి అలీకి సత్కారాలు కూడా అందాయి. అలీ, పవన్ క్లోజ్ ఫ్రెండ్స్ అలీ కూతురు వివాహానికి పవన్ కళ్యాణ్ రాకపోవడం ఏంటని ఇండస్ర్టీలో ఇప్పుడు టాక్ వైరల్ గా మారింది.

అలీ పవన్ ఫ్రెండ్‌షిప్

టాలీవుడ్ ఇండస్ర్టీలో పవన్ కళ్యాణ్ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. పవర్ స్టార్ గా ఎదిగి ఇప్పుడు ఏపీ రాజాకీయాల్లో కీలక రోల్ పోషిస్తున్నారు పవన్. అయితే అలీ పవన్ మంచి స్నేహితులు పవన్ కళ్యాణ్ చాలా సినిమాల్లో అలీ ఒక ప్రధాన పాత్రలో కనిపించేవారు. మొన్నటి కాటమ రాయుడు వరకూ ఈ కాంబో విశేషంగా కొనసాగింది. దర్శక, నిర్మాతలు సైతం పవన్ సినిమా అంటే అలీ డేట్స్ కూడా మస్ట్ అంటూ చెప్తారు. వీరిద్దరి మధ్య మంచి కామెడీ ఉంటుందని చెప్తుంటారు. కానీ వారి మధ్య కూడా విభేదాలు తలెత్తినట్లు ఇండస్ర్టీ చెప్పుకుంటుంది.

అలీ కూతురు పెండ్లికి ఎందుకు రాలేదు

దీనికి ప్రధాన కారణం రాజకీయంగానే చూస్తుంది. ఇటీవల అలీ తన కూమార్తె వివాహ వేడుకకు సంబంధించి కార్డు ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ అందుబాటుల లేడంటే వీరి మధ్య ఎంత ఎడబాటు ఉందో అంటూ చెప్పుకుంటుంది. పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిసిందే.. రాజకీయాల నేపథ్యంలో అలీకి, పవన్ కళ్యాణ్ కు మధ్య దూరం ఏర్పడింది. అది ఎంతంటే అలీ కూతరు వివాహ వేడుకకు సంబంధించి కార్డు ఇచ్చేందుకు వెళ్లిన అలీకి పవన్ అందుబాటులో లేనంతగా. అలీ కూతరు వివాహ వేడుకకు ఆయనతో కలిసి నటించిన వారు, సినీ పెద్దలు చిరంజీవి, నాగార్జున, త్రివిక్రమ్, తదితరులు అందరూ వచ్చారు.

పవన్ మూవీస్ లో కనిపించని అలీ

కానీ పవన్ మాత్రం కనిపించలేదు. ఇద్దరు స్నేహితుల మధ్య రాజకీయం చిచ్చు పెట్టిందని ఇండస్ర్టీ కోడై కూస్తోంది. వారి కాంబోలో చాలా మంచి మూవీస్ చూసిన అభిమానులు మాత్రం అలీ పవన్ కలిస్తే చూడాలని కోరుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే డైరెక్టర్ హీరో డేట్స్ తో పాటు అలీ డేట్స్ కూడా బుక్ చేయాల్సిందే అంతలా ఉండేది వీరి బంధం. పవన్ కళ్యాణ్ చాలా మూవీలో వీరి జర్నీ కొనసాగింది. వీరి కాంబోలో చివరి చిత్రం ‘కాటమరాయుడు’ తర్వాత పవన్ చిత్రాల్లో అలీ కనిపించలేదు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తీస్తున్న సినిమాల్లో కూడా అలీ గురించి ఎలాంటి ప్రస్తావన చిత్ర యూనిట్ నుంచి రావడం లేదు. అలీతో తీవ్ర విభేదాల్లో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇద్దరి ఫ్యాన్స్ మాత్రం వారు కలువాలనే కోరుకుంటున్నారు.