కొత్త సంవత్సరంలోనే వారి రిలేషన్‌ బయట పెడతారట

0
1137

ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే అనుబంధాన్ని రక రకాలుగా అభివర్ణిస్తుంటారు. ఈ ఇద్దరు మగవారైతే ఫ్రెండ్‌షిప్‌ అంటారు. అదే ఆడ, మగ అయితే మాత్రం కన్ఫ్యూజన్‌ స్టార్ట్‌ అవడం కామన్‌. ఒకప్పుడు ఇలా ఆడ, మగా మధ్య స్నేహం చిగురిస్తే దాన్ని ప్రేమ అనేవారు. ప్రస్తుత జనరేషన్‌లో అయితే రిలేషన్‌ షిప్‌ అంటున్నారు. ప్రేమ కన్నా ఈ రిలేషన్‌షిప్‌లో లోతు చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ లోతు అంతు చూసే వరకూ జాగ్రత్తలు

అందుకే ఈ లోతు అంతు చూసే వరకూ రిలేషన్‌లో ఉన్న వ్యక్తులు తమ వ్యవహారాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు పడుతుంటారు. సామాన్యులకు చెందిన రిలేషన్స్‌తో అయితే సొసైటీకి పెద్దగా పనుండదు. అదే సెలబ్రిటీల రిలేషన్‌ అయితే ఇక సందడే సందడి. ప్రతి కన్నూ వారి ఫేస్‌బుక్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లు, టెలీగ్రామ్‌లు, ట్విట్టర్‌ ఖాతాలు ఇలా వారికి సంబంధించిన సోషల్‌ మీడియా ఖాతాలపైనే ఉంటుంది. పొరపాటున ఎక్కడైనా చిన్న క్లూ దొరికిందా.. ఇక రచ్చే రచ్చ.

వీరిద్దరూ డీప్‌ రిలేషన్‌లో

ఈ రచ్చ అంతా ఎందుకు అనుకునే వారు తమకు తామే అసలు విషయాన్ని ప్రపంచంతో పంచుకుంటారు. వీరినే ధైర్యవంతులుగా చూస్తుంది సమాజం. తాజాగా ఇటువంటి ధైర్యాన్ని చూపించటానికి సిద్ధపడిరది బాలీవుడ్‌లోని ఓ సెలబ్రిటీ రిలేషన్‌ జంట. వారెవరో కాదు అందాల భామ కియారా అద్వాని.. సిద్దార్ధ్‌ మల్హ్రోత్రా. ఈ మధ్య కాలంలో వీరిద్దరూ డీప్‌ రిలేషన్‌లో ఉన్న విషయం బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది.

రిలేషన్‌షిప్‌ను బయట పెట్టడానికి రెడీ

విషయం ఎలాగో బయటకు వచ్చింది కాబట్టి అనవసరం రచ్చకు.. చర్చకు తావివ్వకుండా వీరిద్దరూ నూతన సంవత్సరం సందర్భంగా తమ రిలేషన్‌షిప్‌ను బయట పెట్టడానికి రెడీ అవుతున్నారట. గుప్పిట మూసినంత కాలం ఉత్సుకత ఉంటుంది. అది తెరిస్తే ఇక చేసేది.. రాసేది ఏముంటుంది. అందుకే మీడియా నోరు మూయించటానికి వీరిద్దరూ కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.