కన్నడ కొత్త సినిమా దెబ్బకి ‘సలార్’ వసూళ్లు ఢమాల్..బ్రేక్ ఈవెన్ కష్టమే!

0
350
Kannadas new movie Salaar collections dwindled..break even is difficult!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్’ చిత్రం రీసెంట్ గానే విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకొని అద్భుతమైన వసూళ్లను రాబడుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఓపెనింగ్స్ అయితే కచ్చితంగా #RRR రేంజ్ లోనే ఉన్నాయి.

అందులో ఎలాంటి సందేహం లేదు , కానీ క్లోసింగ్ వసూళ్లు ‘ఆదిపురుష్’ కి అటు ఇటుగా ఆగే విధంగా ఉన్నాయి. ఈ ఏడాది డివైడ్ టాక్ ని తెచ్చుకున్న తమిళ హీరో విజయ్ ‘లియో’ చిత్రం సౌత్ ఇండియా మొత్తం దుమ్ము లేపి సుమారుగా 620 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది.

కానీ సలార్ చిత్రానికి హిందీ మార్కెట్ సహాయం తో కూడా, 550 కోట్ల రూపాయిల గ్రాస్ దగ్గర క్లోజ్ అయ్యేట్టు ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా కర్ణాటక లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉంది.

Nagarjuna shocked the producers guild

కానీ ఈ చిత్రానికి పది కోట్ల రూపాయిల నష్టం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. సోలో రిలీజ్ ఉండుంటే బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా వచ్చే అవకాశం ఉండేది కానీ,

కన్నడ సూపర్ స్టార్ దర్శన్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కటీర’ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతుండడం తో ఆ చిత్రం ప్రభావం ‘సలార్’ మీద చాలా బలంగా పడింది.

కాబట్టి ఈ ప్రాంతం లో నష్టం వచ్చేట్టుగా అనిపిస్తుంది. ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి.

కానీ ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం 57 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. కనీసం 15 కోట్ల రూపాయిలు అయినా నష్టం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఓవరాల్ గా ఈ సినిమా 345 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాల్సిన అవసరం ఉంటే, ఇప్పటి వరకు 287 కోట్ల రూపాయిల వసూళ్లు మాత్రమే వచ్జింది.

అంటే బ్రేక్ ఈవెన్ చెయ్యాలంటే ఇంకా 60 కోట్లు రావాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అది కష్టం అనే చెప్పాలి. చూడాలి మరి ఫుల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.