శ్రీహాన్ దుప్పట్లోకి దూరిన శ్రీసత్య.. బిగ్ బాస్ హౌజ్ లోకి దెయ్యం..?

0
399

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 రాను రాను మరింత టఫ్ గా మారుతోంది. గత సీజన్లతో పోలిస్టే ఈ సీజన్ అంతగా రాణించకున్నా విన్నర్ ను అనౌన్స్ చేయాలి మరి. అయితే బిగ్ బాస్ కు బయటి నుంచి కూడా రాను రాను ఆదరణ తగ్గుతుందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇక హౌజ్ మెంబర్స్ లలో శ్రీహాన్ ఫైనల్ కు చేరుకోగా మిగిలిన వారు నామినేషన్ కు చేరువయ్యారు. ఇక రేవంత్, ఇనయా సుల్తానా ఓటింగ్ లో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది.

గేమ్ ప్లాన్ చేంజ్ చేసిన ఇనయా సుల్తానా

గతంలో కంటే ఈ మధ్య ఇనయా గేమ్ ప్లాన్ చేంజ్ చేసింది. అన్ని విభాగాల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. చాలా వరకు ఆమె ఒంటరిగానే పోరాటం చేస్తూ స్ర్టాంగ్ కంటెస్టెంట్ గా గుర్తింపు సంపాదించుకుంటుంది. ఆమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరుగుతోంది. ఆమెను టాప్ 5లో లేదంటే విన్నర్ గా నిలబెట్టాలని ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారట. గత వారం ఆమె నామినేషన్ లో లేదు దీంతో ఓటింగ్ కూడా తగ్గుతుందని అందరూ అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా ఓటింగ్ లో దూసుకుపోతోంది ఇనయా.

రేవంత్-ఇనయా మధ్య గట్టి పోటీ

ఇటీవల ఎలిమినేషన్ లో భాగంగా హౌజ్ నుంచి ఫైమా బయటకు వెళ్లింది. ఇక బిగ్ బాస్ హౌజ్ లో మిగిలింది ఏడుగురే. బిగ్ బాస్ వారితో ఒక గేమ్ ఆడించాడు. ఒక్కొక్కరూ ఒక్కో నెంబర్ ఉన్న పోల్స్ ను ఎంచుకోవాలని సూచించాడు. దీంతో 1వ పోల్ ను రేవంత్, 2ను ఇనయా, 3ను కీర్తి, 4ను శ్రీసత్య, 5ను శ్రీహాన్, 6ను ఆడిరెడ్డి, 7వ పోల్ ను రోహిత్ ఎంచుకున్నాడు. ఇందులో బిగ్ బాస్ ప్లాన్ ఏమీ లేదు. హౌజ్ లోని కంటస్టెంట్ వారిని ఇష్టం ఉన్న పోల్స్ ను ఎంచుకున్నారు. ఆడియన్స్ వీరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తారనేది వేచి చూడాలి.

మంగళవారం టాస్క్

ఇప్పటి వరకూ ఆడియన్స్ ఓట్లతో రేవంత్, ఇనయా సుల్తానా మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ఇద్దరికీ 2 శాతం మాత్రమే తేడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారం ఓటింగ్ తో ఇద్దరూ ఫేం అవుతారు. బిగ్ బాస్ మంగళవారం రేవంత్, ఇనయా మధ్య ఓ టాస్క్ ఇచ్చారు. ఇందులో రేవంత్ విన్ అయ్యి రూ.1.10 లక్షలు గెలుచుకున్నాడు. తర్వాతి టాస్క్ ఆదిరెడ్డి-కీర్తి, శ్రీహాన్-శ్రీసత్యల మధ్య జరిగింది. ఇందులో శ్రీహాన్-శ్రీసత్య గెలిచారు. మరో టాస్క్ రేవంత్, ఇనయా మధ్య జరిగింది. ఈ టాస్క్ లో రేవంత్ గెలిచాడు. ఇంటి సభ్యులు కూడా రేవంతే గెలుస్తాడని చెప్పడంతో ఆయన రూ. 2 లక్షలు తిగిరి పొందాడు. దీంతో విన్నర్ ప్రైజ్ మనీ రూ. 41 లక్షలకు చేరింది.

బిగ్ బాస్ హౌజ్ లో హర్రర్ సన్నివేశాలు

రాత్రి 2 గంటల సమయంలో శ్రీసత్య ఇంటి సభ్యులతో ముచ్చటిస్తూ తనకు గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పింది. తన ఫ్రెండ్ కు నిద్రలో నడిచే అలవాటు ఉందని చెప్పడం పూర్తవ్వగానే భిగ్గరగా ఒక శబ్ధం వినిపించింది. దీంతో అందరూ కేకలు వేస్తూ పరుగులు తీవారు. శ్రీసత్య శ్రీహాన్ దుప్పట్లో దూరింది. దీంతో శ్రీహాన్ కూడా భయపడిపోయి బిగ్గరగా అరిచాడు. దీంతో హౌజ్ అంతా రచ్చ రచ్చ అయ్యింది. ఇక ఇనయా సుల్తానా దయ్యం పట్టిన అమ్మాయిలా ప్రవర్తించింది. గట్టిగా అరుస్తూ, కేకలు వేస్తూ, నవ్వుతూ అందరినీ భయపెట్టింది. ఈ ఎపీసోడ్ ప్రేక్షకులకు నవ్వులు పూయించాయి.