కృష్ణ మరణానంతరం అవయవాలు దానం.. వైరల్ అవుతున్న న్యూస్

0
297

టాలీవుడ్ ఇండస్ర్టీ గురించి చెప్పాలంటే సూపర్ స్టార్ కృష్ణ గురించి తప్పక చెప్పుకోవాల్సిందే.. ఆయన జమానాలోనే కొత్త జానర్ లో వెతుక్కొని మరీ కమిట్ అయ్యేవారు. అప్పటికి అనూకూలంగా ఉన్న టెక్నాలజీని కూడా ఆయన వాడుకున్నంత ఎవరూ వాడుకోలేదు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోల్లో ఆయన ముందు వరుసలో నిలిచేవారు.

యంగ్ హీరోలకు కూడా వెలితిగానే

చివరి రోజుల్లో కూడా కొన్ని ఈవెంట్లలో పాల్గొని యంగ్ స్టార్ ను మంచి గైడ్ చేసేవారు కృష్ణ. ఆయన ఇప్పుడు లేరని వార్త సూపర్ స్టార్ ఫ్యాన్స్ కే కాకుండా యంగ్ హీరోలకు కూడా వెలితిగానే అనిపిస్తుందట. నటుడిగానే కాకుండా మంచి ఫిలాసఫర్ గా కూడా ఆయనను యంగ్ జనరేషన్ హీరోలు ఆయనను అభిమానిస్తారు.

చివరి రోజులు హాస్పటిల్ లో ఉండగా

అందరితో కలుపుగోలుగా ఉంటూ ప్రతి ఒక్కరినీ ప్రేమగా పలకరిస్తారని ఆయనతో సన్నిహితంగా ఉండేవారు చెప్పుకస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలపై ఆయన చిన్నతనం నుంచి ఆసక్తి చూపేవారు. బ్లడ్ డొనేషన్, పార్ట్స్ డొనేషన్ లాంటి క్యాంపులకు అడెంట్ అయి వాటితో సమాజానికి కలిగే ప్రయోజనాలకు వివరించేవారు కృష్ణ. బహూషా ఆయనలోని ఈ గుణమే మహేశ్ బాబుకు కూడా వచ్చిందని ఇండస్ర్టీ చెప్తుంది. కృష్ణ చివరి రోజులు హాస్పటిల్ లో ఉండగా ఒక చిన్నారి ఆపరేషన్ కోసం కొంత డబ్బు ఇచ్చి మహేశ్ బాబు దాతృత్వం చాటుకున్నాడు.

చనిపోయిన తర్వాత కూడా మరొకరికి మేలు

కృష్ణ దాతృత్వ గుణానికి అద్ధం పట్టేలా ఇటీవల ఒక విషయం తెలిసింది. ఆయన మరణానంతరం తనలో పనిచేసే ఏ అవయవ్వానైనా దానం చేయాలని కోరాడంట. ఆయన మరణంతో వైద్యులు కొన్ని అవయవాలు తీసుకున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మహేశ్ బాబు కూడా ఒప్పుకున్నారంట. చనిపోయిన తర్వాత కూడా మరొకరికి మేలు చేయాలన్న సూపర్ స్టార్ కోరికను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.