అజ్ఞాతవాసి, జాని సినిమాల కన్నా దారుణం..!

0
5433

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాలలో ఇప్పటి వరకు దారుణంగా విఫలం చెందిన సినిమాలుగా జానీ, అజ్ఞాతవాసి గా చెప్పుకోవచ్చు. ఈ రెండు సినిమాలు పవన్ కేరియర్ లో అతి పెద్ద డిజాస్టర్ లు గా నిలిచాయి. వసుస హిట్ లు కొడుతూ మంచి ఊపు మీద ఉన్న దశలో పవన్ కళ్యాణ్ సొంతంగా దర్శకత్వం వహించి సినిమా జాని. ఇది 22 ఏళ్ల కిందటి మాట. అప్పట్లో చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి వచ్చిన పవన్.. వసుసగా సూపర్ డూపర్ హిట్ లు కొట్టి చిరంజీవిని కూడా మించి పోయిన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు.

పవన్ కేరియర్ లో అతి పెద్ద డిజాస్టర్

తమ్ముడు, తొలి ప్రేమ, ఖుషి సినిమాల సమయంలో ఇండస్ట్రీ నెంబర్ వన్ అంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని ఎవరైనా చెబుతారు. కేరియర్ బాగా పీక్ దశలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సొంతంగా దర్శకత్వం వహించి సినిమా జాని. ఈ సినిమా స్టోరీ లైన్ బాగానే ఉన్నా.. పవన్ ని దర్శకత్వం లో అనుభవం లేకపోవడంతో పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత పవన్ కేరియర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా అజ్ఞాతవాసి అని చెప్పుకోవచ్చు.

అతడు తీసిన గొప్ప చిత్రం ఒక్కటి కూడా లేదు

ఎంతో అనుభవం ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాని తీసాడంటే ఎవరూ నమ్మలేక పోయారు కూడా. ఇక తాజా విషయానికి వస్తే అనుభవం చాలా తక్కువగా ఉన్న సాగర్ చంద్ర తో పవన్ భీమ్లా నాయక్ తీసాడు. అసలు పవన్ కళ్యాణ్ డైరెక్టర్ ని ఎంచువడంలో ఎవరి సాయం తీసుకుంటాడో? సాగర్ చంద్ర ని తీసుకోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? అతడు తీసిన గొప్ప చిత్రం ఒక్కటి కూడా లేదు. మరి ఎందుకు సాగర్ చంద్ర ని తీసుకున్నాడో మిలియన్ డాలర్ ల ప్రశ్నగా నిలుస్తుంది.

భీమ్లా నాయక్ కన్నా బ్రహ్మోత్సవం ఎంతో బెటర్

ఎందుకంటే జానీ, అజ్ఞాతవాసి లకన్నా చాలా దారుణంగా భీమ్లా నాయక్ ని తెరకు ఎక్కించాడు డైరెక్టర్. సినిమాలో ఎక్కడ కూడా ఆసక్తి కలిగించలేపోయాడు. కనీసం ఈ ఒక్క ఐదు నిమిషాలు సినిమా బాగుందని కూడా సగటు ప్రేక్షకుడు చెప్పలేక పోతున్నాడు. ఒక పెద్ద స్టార్ తో సినిమా తీస్తున్నప్పుడు ఎంత జాగ్రత్త వహించాలి? ఇప్పటికైనా ఇంత పెద్ద డిజాస్టర్ ని తీసినందుకు సాగర్ చంద్ర అటు పవన్ కళ్యాణ్ కి ఇటు అభిమానులకు క్షమాపణలు చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే మహేష్ బాబు ట్విట్ చేస్తూ భీమ్లా నాయక్ చాలా బాగా నచ్చిందని చెప్పడం పెద్ద జోక్. దీని కన్నా బ్రహ్మోత్సవం ఎంతో బెటర్.