బీమ్లా నాయక్ ప్లాప్ తో పునరాలోచనలో పవన్

0
2067

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన చిత్రం బీమ్లా నాయక్. ఈ చిత్రం తొలిరోజు చూసిన అభిమానులు అందరూ బాగా ఉందని చెబుతూ వచ్చారు. వారితో పాటు అటు సినీ ఇండస్ట్రీ తో పరిచయాలు ఉన్న వెబ్ సైట్ లు అన్ని అబ్బో అదరహో అని డప్పు కొట్టాయి. మొదటి రోజు అంతా బాగానే జరిగింది. రెండో రోజు నుండి అసలు కథ మొదలైంది. రెండో రోజు నుండి సినిమా బాగుందని చెబుతున్నారు కదా అని సగటు ప్రేక్షకుడు థియేటర్ కి రావడం మొదలు పెట్టాడు.

రెండో రోజు నుండి భయపడ్డ అసలు రంగు

అక్కడే అసలు రంగు బయట పడింది. సినిమా కనీసం మినిమం కూడా లేకపోవడంతో ఏకంగా మీడియా ముందే ప్రేక్షకులు తమ అసంతృప్తి వెళ్లగక్కారు. బీమ్లా నాయక్ చిత్రం బాగాలేదని మౌత్ పబ్లిసిటీ బాగా వెళ్ళింది. దీంతో కలెక్షన్ లపై భారీ ఎఫెక్ట్ పడింది. దీనితో మూడో రోజు ఆదివారం అయినా కలెక్షన్ లు 10 కోట్లు కూడా దాటలేదు. దీనితో చిత్ర టీం లో ఆందోళన నెలకొంది.

40 కోట్లు అంటే కష్టమే

మొదటి సారి చూసిన అభిమానాలు కూడా రెండో చూడడానికి ఆసక్తి కనబరచడం లేదు. మూడు రోజులు ముగిసినా సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 40 కోట్లు రాబట్టాల్సి ఉంది. అయితే సినిమా బాగాలేదని మౌత్ పబ్లిసిటీ బాగా వెళ్లడంతో అది అసాధ్యంలా కనిపిస్తుంది. శివరాత్రి ఉండడం, సినిమా కి పోటీ ఏది లేకపోవడం కొంచం కలిసొచ్చే అంశమే అయినా.. 40 కోట్లు అంటే కష్టమే.

ఇతర భాషా చిత్రాలను రీమేక్ చేయడమే

ఇదిలా ఉంటే సినిమా ప్లాప్ టాక్ తో పవన్ కళ్యాణ్ పునరాలోచించుకుంటే మంచిదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీ నుండి విడుదలైన సినిమాలు దేశ వ్యాప్తంగా రికార్డు లు క్రియేట్ చేస్తుంటే.. పవన్ మాత్రం ఇతర భాషా చిత్రాలను రీమేక్ చేస్తుండడం వింతగా అనిపిస్తుంది. అది కూడా ఏమాత్రం ప్రతిభ చూపని డైరెక్టర్ లు ఎంచుకోవడం మరీ వింతగా అనిపిస్తుంది. ఇప్పటికైనా పవన్ తెలుగు ఇండస్ట్రీ లో పెద్ద డైరెక్టర్ లతో సినిమాలు చేసి మంచి విజయాలు సాధించాలని సినీ వర్గాలు కోరుకుంటున్నారు.