ఈసారి అట్లుండది.. అంతకుమించి ఉంటది

0
1091

సిద్ధు జొన్నల గడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఆ సినిమాలోని మేనరిజమ్స్, కొన్ని పదాలను ప్రస్తుత టాలీవుడ్ హీరోలతో పాటు కమెడియన్స్ ఫాలో అవుతున్నారు. ఈ సినిమాలోని అట్లుంటది మనతోని డైలాగ్ పొలిటికల్ లీడర్స్ కూడా పలుకుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల విడుదలైన టిల్లు స్వేర్ టీజర్ కూడా ఆ సినిమా రేంజ్ లో సెన్షేషన్ క్రియేట్ చేస్తున్నది.

విడుదలకు ముందే పార్ట్ 2

సినిమా విడుదలకు ముందే పార్ట్ 2 ఉంటుందని నిర్మాత నాగవంశీతో ఫాటు హీరో సిద్ధు జొన్నల గడ్డ ప్రకటించారు. సినిమా రిలీజ్ కాక ముందే సీక్వెల్ ప్రకటనపై టాలీవుడ్ భిన్న స్వరాలు వినిపించాయి. మరీ ఇంత ఓవర్ కాన్ఫిడెంటా అని ఒక సెక్షన్ నుంచి రియాక్షన్ రాగా, ట్రైలర్.. టైటిల్ సాంగ్ హైప్ తో ఆ మాత్రం ధీమా ఉండాలి అని ఇంకొందరు వారిని సపోర్ట్ చేశారు. అప్పటి వరకు అంతగా ఎలివేట్ కాని సిద్ధూ ఒక్కసారిగా ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. స్టార్ డమ్ వచ్చేసింది.

తెలిసే వేలు పెడుతారు

సేమ్ టైమ్ సినిమా కథ, కథనాల్లో తన సొంత పైత్యం రుద్దాడనే పుకార్లు వినిపించాయి. ఈ కామెంట్స్ ను సిద్ధూ కొట్టిపడేయలేదు. ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ సమాధానం ఇచ్చాడు. కథ, కథనాల్లో తెలియకుండా ఎవరూ వేలు పెట్టరు. తెలిసే వేలు పెడుతారు అని సిద్ధూ చెప్పడంతో సదరు యాంకర్ షాకై పోయింది.

మూవీ సీక్వెన్స్ పై భారీ అంచనాలు

నిర్మాత వంశీ కి క్లోజ్ ఫ్రెండ్ అయిన దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ ఫస్ట్ పార్ట్ లో రచనా సహకారం అందించాడు. త్రివిక్రమ్ సహకారం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. కరోనా థర్డ్ వేవ్ లో ఒక్కో సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంటే డీజే టిల్లు మాత్రం అన్ సీజన్ లో రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసింది. చేసిన ఖర్చు కంటే ఊహించని లాభాలను తీసుకు వచ్చింది. అప్పటి నుంచి ఈ మూవీ సీక్వెన్స్ పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. దీనికి దీపావళి రోజున రిలీజైన ట్రైలర్ కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది.

ఆమె కే ప్రాధాన్యం

ఫస్ట్ పార్ట్ అంతా హీరోయిన్ చుట్టూనే కథ, కథనం సాగుతుంది. కాగా సీక్వెన్స్ లోనూ కథానాయికకే ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తున్నది. పార్ట్ 1 లో హీరోయిన్ గా చేసిన నేహా శెట్టి సీక్వెన్స్ లో నటించడం లేదని నిర్మాతలు ముందే హింట్ ఇచ్చారు. సీక్వెన్స్ లో శ్రీలీల ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని , కొన్ని అనివార్య కారణాల కారణంగా ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నట్లు తెలిసింది . తర్వాత అనుపమ పరమేశ్వరన్ కూడా సెలెక్ట్ అయినట్లు మీడియాలో వార్తలు వినిపించాయి. త్వరలోనే అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నారని మ్యాటర్ లీకైంది.

సోషల్ మీడియాలో వైరల్

కానీ..ఈ సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్ కూడా సైడ్ అయినట్లు తెలుస్తున్నది . ఫస్ట్ పార్ట్ లో కొన్ని సీన్స్, డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ని దూరం చేసిన విషయం తెలిసిందే. సీక్వెల్ లో అంతకు మించిన డైలాగ్స్, రోమాంటికల్ సీన్స్ ఉన్నాయనే కారణంతో అనుపమ అబ్జెక్షన్ చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ టూమచ్ గా ఉంటుందని, పూర్తి స్క్రిప్ట్ విన్న అనుపమ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని టాక్.

అనుపమ తన సోషల్ మీడియాలో ఖాతాలో చేసిన పోస్ట్ ఈ సినిమా గురించే ననే చర్చించుకుంటున్నారు. అనుపమ ”ఒకచోట ఎగ్జిట్ అయితే మరొకచోట ఎంట్రీ ఉంటుంది” అంటూ చేసిన పోస్ట్ డీజే టిల్లు స్క్వేర్ గురించేనని అభిమానులు చర్చించుకుంటున్నారు. నుంచి తప్పుకున్నట్లు చెప్పకనే చెప్పేసింది అంటున్నారు అభిమానులు.