దేశాన్ని కుదిపిన ‘కాంతారా’.. ఓటీటీలో మాత్రం ఫెయిల్

0
615

దేశ సినీ రంగాన్ని యావత్తు ఒక్క కుదుపు కుదిపిన సినిమా ‘కాంతారా’. కేవలం 15 కోట్లతో తీసినా దాదాపు రూ. 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇప్పుడు ఓటీటీలో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ మూవీ. శాండల్ వుడ్ నుంచి వచ్చిన ఈ సినిమాకు డైరెక్టర్, నిర్మాత, హీరోగా కూడా రిషబ్ శెట్టి వ్యవహరించారు. సినిమా నిర్మాణంలో ఎలంటి అంచనాలు లేవు. కేవలం శాండల్ వుడ్ (కన్నడ చిత్ర పరిశ్రమ) లో మాత్రమే విడుదల చేసిన ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.

ఓటీటీలోకి విడుదల

దీంతో చిత్ర యూనిట్ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని అనుకుంది. వెంటనే విడుదల చేసింది కూడా. దేశ వ్యాప్తంగా కూడా బాక్సాఫీస్ హిట్లను తిరగరాస్తూ వచ్చింది. దీంతో ఓటీటీలోకి విడుదల చేయాలనుకున్నారు. ఓటీటీలోకి కూడా అప్పుడూ ఇప్పుడూ అంటూ చిత్రంపై బాగా హైప్ ను పెంచింది చిత్ర యూనిట్ చివరికి విడుదల కూడా చేసింది.

చిత్రంలో ఏముంది

పాన్ ఇండియా రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపించిన ‘కాంతారా’ నవంబర్ 24 నుంచి ఓటీటీలో అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అయితే ఓటీటీలో మాత్రం థియేటికల్ రేంజ్ లో కొనసాగడం లేదట. ఇందులో ప్రధాన అంశం కర్ణాకట మారుమూల గ్రామల్లోని ‘భూత కోలా’ ఓవ్ అనే శబ్ధంతో వచ్చే సన్నివేశాలు థియేటికల్ లో బాగా హైలట్ గా నిలిచాయి కానీ ఓటీటీలో అంతలా ఆకట్టుకోవడం లేదంట.

వర్జినల్ పాట తొలగింపు

దీనికి తోడు ఓటీటీకి వచ్చిన కొత్తలో ‘వరాహ రూపం’ వర్జినల్ పాటను చిత్రం నుంచి తొలగించారు. కోర్టు ఆదేశాల మేరకు తొలగించినట్లు చిత్ర యూనిట్ చెప్పింది. అయితే మూవీ ఓటీటీలకు వచ్చిన కొత్తలోనే చాలా మంది కాంతారా హైప్ ను వింటూ మూవీ చూశారు. ఓవ్ శబ్ధం ఆకట్టుకోకోవడం, అందులో వారాహ రూపం వర్జినల్ వెర్షన్ కూడా లేకపోవడంతో ఓటీటీలో అభిమానులు పెదవి విరిస్తున్నారు.

ల్యాగ్ గా మూవీ

దేశ వ్యాప్తంగా హిట్ అవుతూ బాక్సాఫీస్ కలెక్షన్లను సాధించిన ‘కాంతారా’పై అప్పట్లో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అయితే ఓటీటీలోకి రావడంతోనే ఎందుకు నెగెటివ్ టాక్ వస్తుందో అంటూ చిత్ర యూనిట్ కసరత్తు చేయడం ప్రారంభించిందట. అయితే ఈ సినామకే హైలెట్ గా నిలిచి పాట లేకపోవడం అని తెలిసి దానికి కూడా యాడ్ చేశారు. అయినా ఓటీటీలో అభిమానులు మాత్రం ఇందులో కొత్త ఏముంది..? ఒక్క క్లైమాక్స్ తప్పితే అంటున్నారు.

చాలా తెలుగు సినిమాలలో చూసినట్లే

అది కూడా చాలా తెలుగు సినిమాలలో చూసినట్లే ఉంది. అంటూ పెదవి విరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా బిగ్ హిట్ దక్కించుకున్న మూవీని ఇప్పుడు విమర్శిస్తే ఏం ప్రయోజనం అంటూ కూడా కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా థియేటర్ లో సాధించుకున్న హైప్ ను ఓటీటీలో మాత్రం కాంతారా ఇవ్వలేకపోయింది.