దాసరిని వదిలెయ్‌.. నువ్వయితే ఈ సీన్‌ ఎలా తీస్తావ్‌?

0
216
dasari narayana rao

సినిమా అంటేనే మాయా ప్రపంచం ఇక్కడ తిమ్మిని బమ్మిని చేయొచ్చు.. బమ్మిని తిమ్మిని చేయొచ్చు.. కావాల్సిందల్లా ఈ చేసే నేర్పరితనమే. నొప్పింపక.. తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా మనం మర్చి పోయిన విషయాన్ని ఏదో ఒక రకంగా కవర్‌ చేసి బయటపడే ట్రిక్కు దర్శకరత్న దాసరికి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో.. అందు అంటారు దేనికైనా సరి… దాసరి అని.

ఇక విషయంలోకి వెళితే.. అది దాసరి గారు ఊపిరి సలపనంత బిజీగా ఉన్న రోజులు దర్శకుడిగా, రచయిత, సమర్పకుడిగా, నిర్మాతగా ఇలా తన బహుముఖ ప్రజ్ఞను వెండితెరపై ఆవిష్కరిస్తున్న 1982వ సంవత్సరం. కృష్ణంరాజు, జయప్రద జంటగా లక్ష్మీదేవీ ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మాత కుమార్జీ దాసరి దర్శకత్వంలో ‘గోల్కొండ అబ్బులు’ నిర్మిస్తున్నారు. దాసరి దర్శకత్వంలో అప్పటికే పలు భారీ చిత్రాలు షూటింగ్‌లో ఉన్నాయి. ప్రతి రోజూ మూడు షిఫ్ట్‌ల్లో పనిచేస్తున్నారు.

ఓ రోజు మధ్యాహ్నం షిఫ్ట్‌లో వేరే షూటింగ్‌కు వెళ్లబోయి అనుకోకుండా గోల్కొండ అబ్బులు లొకేషన్‌కు వచ్చారు. అప్పటికే అక్కడ రావుగోపాలరావు, జయప్రద, నిర్మాత ముఖర్జీ ఉన్నారు. కో`డైరెక్టర్‌ సి.వి. రమణబాబు షాట్‌ రెడీ చేసుకున్నారు. అనుకోకుండా గురువుగారు రావడంతో ఆయన సైలెంట్‌గా పక్కకు జరిగిపోయాడు. నిర్మాత ముఖర్జీతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారే గానీ అక్కడ షాట్‌ ఏమిటో ఆయనకు గుర్తుకు రావడం లేదు.

dasari narayana rao

బాలయ్య రికార్డులను బ్రేక్ చేసిన మెగాస్టార్

సహజంగా పెద్ద దర్శకులు స్టార్‌ హీరోలతో చేసే సినిమాల్లో స్టార్‌ హీరో లేని సీన్లు ఎక్కువగా కో`డైరెక్టర్‌తో షూట్‌ చేస్తుంటారు. అలాగే ఈ సీన్‌ను కూడా ప్లాన్‌ చేశారు. అయితే అనుకోకుండా దాసరి గారు అక్కడికి రావడంతో ఆయన డైరెక్ట్‌ చేయాల్సిన పరిస్థితి. సీన్‌ ఆయనకు గుర్తుకు రావడం లేదు. కో`డైరెక్టర్‌ రమణబాబుని పిలిచి అడుగుదామంటే స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు కూడా దాసరిగారే కావడంతో ఆయన ముందు అడగలేరు. కెమెరామెన్‌ కె.యస్‌. మణి తొందర పెడుతున్నాడు.

ఏం చేయాలా అని అలోచిస్తున్న దర్శకరత్నకు ఓ ఐడియా తట్టింది. వెంటనే పక్కనే నిలబడి ఉన్న అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌లో ఒకరైన ఎ. మధుబాబును పిలిచి ఏవయ్యా వర్క్‌ జాగ్రత్తగా నేర్చుకుంటున్నావా? అన్నారు. దానికి మధుబాబు భయం భయంగా నేర్చుకుంటున్నాను సార్‌ అన్నాడు. ఏం నేర్చుకుంటున్నావో నేనూ చూస్తాను దాసరిని వదిలెయ్‌ ఈ సీన్‌ను నువ్వయితే ఎలా చేస్తావా చెప్పు అన్నారట. దీంతో మధుబాబు ఒక్కసారిగా ఖంగు తిన్నాడు. ఏం చేయాలో తోచటం లేదు. వెంటనే దాసరిగారు అదేంటయ్యా.. నువ్వు ఏం నేర్చుకుంటున్నావో నాకు తెలియాలి కదా.. కానీ.. అన్నారు.

చేసేది లేక మధుబాబు సార్‌ జయప్రదగారు వారి తండ్రిగారితో తనను ఓ వ్యక్తి ఆటపట్టించి సారీ చెప్పించుకున్న విషయాన్ని తండ్రితో చెప్పటానికి ముందుగా అలకతో కూడిన కోపాన్ని నటిస్తూ.. సోఫాలో పడుకుంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన తండ్రితో.. అని చెప్పబోతుంటే వెంటనే దాసరికి సీన్‌ వెంటనే గుర్తుకు వచ్చేసింది.

దాంతో వెరీ గుడ్‌ మధుబాబు వెరీగుడ్‌ ఇలా ఫాలో అవ్వాలి ఓకేనా.. ఆ జయప్రద నువ్వు వచ్చి ఆ సోఫాలో అలక నటిస్తూ పడుకోమ్మా.. అన్నారట… అలా ఉంటది మరి దాసరి గారి మేనేజ్‌మెంట్‌ అంటే. నిత్యం మూడు స్టూడియోలు, ఆరు సినిమాలు అన్నట్లుగా బిజీగా ఉండే దాసరి గారు తెలుగు సినీ కళామతల్లిని వదిలి పోవడం నిజంగా తీరని లోటే… ఈ చిత్రానికి మూలకథ గొల్లపూడి మారుతీరావు.