జగన్ సాధించిన అతి పెద్ద విజయాలు ఇవిగో

0
477
ys jagan victory

కరోనా వచ్చిన తర్వాత అన్నీ రాష్ట్రాలు లాగానే మన ఆంధ్ర ప్రదేశ్ కూడా తీవ్రంగా నష్టపోయింది. ప్రాణ నష్టం ఎంత జరిగిందో, ఆస్తి నష్టం కూడా అదే రేంజ్ లో జరిగింది. అలాంటి సమయం లో సమర్ధవతం గా పాలన అందిస్తూ, కరోనా భారిన పడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడేందుకు జగన్ ఎంతో కష్టపడ్డాడు. ఇతర రాష్ట్రాలకు కరోనా సమయం లో ఎలా ఎదురుకోవాలి అనేది చెప్పడానికి ఒక మార్గదర్శిగా మారాడు. నిధులన్నీ అక్కడే ఎక్కువగా ఖర్చు అవ్వడం పాలన చాలా కష్టం అయ్యింది.

సీఎం జగన్ అత్యవసర సమావేశం!

అందువల్ల తీవ్రమైన వ్యతిరేకత ప్రభుత్వం పై ఏర్పడింది. ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం అనేది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. అయినప్పటికీ కూడా జగన్ పట్టువీడకుండా ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా చేయలేకపోయినా ఒక పనిని జగన్ చేసి కార్యకర్తలతో, వైసీపీ నాయకులతో శబాష్ అని అనిపించుకున్నాడు.

ys jagan victory

టీడీపీ, జనసేనలో మొదలైన భయం

అదేమిటంటే గతం లో రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు పై ఎన్నో కేసులు పెట్టి జైలుకు పంపాలని చూసాడు. చంద్రబాబు ఎంత అవినీతి చేసినా దొరక్కుండా తప్పించుకోవడం లో చాణక్యుడు. కాబట్టి రాజశేఖర్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా చంద్రబాబు ని ఒక్కటంటే ఒక్క కేసు లో కూడా జైలుకు పంపలేకపోయాడు.

కానీ జగన్ మాత్రం స్కిల్ డెవలప్మెంట్ కేసు లో అన్నీ ఆధారాలను పట్టుకొని, చంద్రబాబు పై కేసు వేయించి, సుమారుగా రెండు నెలల పాటు జైలు జీవితాన్ని గడిపేలా చేసాడు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని, జాతీయ స్థాయిలో రాజకీయాలపై ప్రభావం చూపగలిగేంత సత్తా ఉన్న మనిషిని, ఇలా నాలుగు గోడల మధ్య బంధించడం అనేది జరగడం మన ఆంధ్ర ప్రదేశ్ లో ఇదే తొలిసారి.

గతం లో జగన్ కి కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది కానీ, ఆయన ఆ సమయానికి కేవలం ఒక శాసన సభ్యుడు మాత్రమే. ప్రస్తుతానికి బైలు మీద చంద్రబాబు బయట తిరుగుతున్నాడు కానీ, ఆయన ఎప్పుడైనా మళ్ళీ జైలుకు పోవచ్చు. అలా లాక్ చేసాడు జగన్, ఈ ఏడాది లో ఆయన సాధించిన అతి పెద్ద విజయం ఏదైనా ఉందా అంటే, అది ఇదే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.