సీఎం జగన్ అత్యవసర సమావేశం

0
242
ys jagan cabinet meeting

ముఖ్యమంత్రి జగన్ కి రాబొయ్యే సార్వత్రిక ఎన్నికలలో ఓటమి తప్పదనే విషయం అర్థం అయిపోయిందా?, అందుకే నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించి మంచి పేరు లేని ఎమ్యెల్యే లకు, గెలిచే అవకాశాలు లేని అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధం గా లేడా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రతీ ప్రాంతం లోను కులాలు, వర్గాలను ఆధారంగా చేసుకొనే ఆయన ఈసారి ఎమ్యెల్యే టికెట్స్ ఇవ్వడానికి సిద్దపడినట్టు తెలుస్తుంది.

ఈ విషయం పార్టీ లో ఉన్నవాళ్లందరికీ తెలియడం తో ఒక్కొక్కరుగా పార్టీని వీడేందుకు సిద్దపడుతున్నట్టు రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. నిన్న మంగళగిరి వైసీపీ పార్టీ ఎమ్యెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి రాజీనామా చెయ్యడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో మంగళగిరి నుండి పోటీ చేసిన ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ప్రత్యర్థి నారా లోకేష్ పై దాదాపుగా 7 వేల ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.

ys jagan cabinet meeting

జగన్ కి తలనొప్పిగా మారిన రేవంత్ రెడ్డి

అయితే వచ్చే ఎన్నికలలో తనకి సీట్ దక్కదు అనే విషయాన్నీ బాగా అర్థం చేసుకున్న ఆళ్ళ రామకృష్ణ రెడ్డి నిన్న తన ఎమ్యెల్యే పదవికి అలాగే వైసీపీ పార్టీ కి రాజీనామా చేసి బయటకి వచ్చేసాడు. ఈ సందర్భంగా తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి అందచేసాడు. అయితే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి రాజీనామా చెయ్యడం తో ముఖ్యమంత్రి జగన్ గుంటూరు జిల్లా నాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసాడు.

టీడీపీ సీనియర్ నాయకుడు గంజి చిరంజీవి వైసీపీ లో చేరిన సంగతి మన అందరికీ తెలిసిందే. మంగళగిరి కి చెందిన ఈయన పద్మశాలి కులానికి చెందిన వ్యక్తి. ఆయన వర్గం ఓట్లు మంగళగిరి లో అత్యధికంగా ఉండడం తో ఎమ్యెల్యే సీట్ మంగళగిరి స్థానానికి గంజ్ చిరంజీవికే ఖరారు అయ్యినట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గానే ఇంచార్జి గా నియమించిన జగన్, ఆయనతో మరియు కొంతమంది గుంటూరు ముఖ్య నాయకులతో సుమారు 45 నిమిషాల పాటు చర్చలు జరిపాడు.

రాబొయ్యే రోజుల్లో ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, అనే వాటిపై జగన్ దిశానిర్దేశం చేసాడు. అలాగే ఉమ్మడి గుంటూరు మరియు కృష్ణా జిల్లాలకు సంబంధించిన మంత్రులతో కూడా జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేసాడు. ఈ సమావేశం లో గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ తో పాటుగా మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని వంటి వారు కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు.